అనిల్ అంబానీ.. అప్పు తీర్చు

by Shamantha N |
అనిల్ అంబానీ.. అప్పు తీర్చు
X

లండన్: రిలయెన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి లండన్ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లోన్ అగ్రిమెంట్ ప్రకారం మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 717 మిలియన్ డాలర్ల(రూ. 5377 కోట్ల)ను 21 రోజుల్లోగా చెల్లించాలంటూ రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీని లండన్‌లోని హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆదేశించింది. కొవిడ్-19 నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో లండన్ హైకోర్టులోని వాణిజ్య విభాగంలో జస్టిస్ నిగెల్ రిమోట్ హియరింగ్ ద్వారా శుక్రవారం విచారణ చేపట్టారు. రుణం తీసుకున్నప్పుడు అనిల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు. రిలయన్స్ కామ్ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో హామీ ఇచ్చిన వ్యక్తే దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, నేరుగా ఆ సంస్థ ప్రతినిధి బాధ్యతే అని, ఇది దివాలా చర్య చట్టం కింద వర్తింస్తుందంటూ న్యాయమూర్తి పేర్కొన్నారు. మూడు చైనీస్ బ్యాంకుల నుంచి ఆర్‌కామ్ 2012, ఫిబ్రవరిలో 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకోగా, దీనికి అనిల్ అంబానీ తన వ్యక్తిగత హామీని ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed