- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన సర్వే
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించగా.. ఇవాళ అదే చేవెళ్ల నుంచి గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయబోతున్నారు. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు బీజేపీ అభ్యర్థులంతా విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు ప్రకటించాల్సి ఉంది.
ఈ సమయంలో తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో వెల్లడిస్తూ తెలంగాణ ఆవాజ్ అనే సంస్థ తన వీక్లీ సర్వేను విడుదల చేసింది. ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల ఓపీనియన్‌తో సేకరించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 29.8%, బీజేపీకి 28.6%, బీఆర్ఎస్‌కు 24.3%, తటస్థులు 12.3%, ఇతరులు 4.9 ఓట్లు వస్తాయని పేర్కొంది. మొత్తంగా కాంగ్రెస్‌కు 6 నుంచి 8 సీట్లు, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు, బీఆర్ఎస్‌కు 2 నుంచి 4 సీట్లు, ఇతరులకు ఒక సీట్లు రాబోతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని చూస్తోన్న బీఆర్ఎస్ నేతలకు ఈ సర్వే షాక్‌కు గురి చేసింది.