అధికారంలో ఉన్న పార్టీలే మా వద్దకు వస్తాయి.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-04-15 04:42:29.0  )
అధికారంలో ఉన్న పార్టీలే మా వద్దకు వస్తాయి.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎమ్ఐఎమ్ కీలక నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తమను కాంగ్రెస్‌కు బీ-టీమ్ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎప్పుడూ ఎవరికీ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలే తమ వద్దకు వచ్చారని అన్నారు. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీలే తమతో కలిసి పనిచేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీతో తాము పనిచేయించుకున్నామని వెల్లడించారు. ఎమ్ఐఎమ్ చాలా బలమైన పార్టీ అని అన్నారు. తమ పార్టీని ఓడించడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు. ఎంత మంది కలిసిగట్టుగా వచ్చి పోటీ చేసినా తాము భయపడం అని అన్నారు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Advertisement

Next Story