- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం మోడీ క్లియర్‌గా చెప్పారు.. CM రేవంత్‌కు బండి సంజయ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్పందించారు. ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొస్తోందని విమర్శించారు. రిజర్వేషన్ల రద్దు ఉండబోదు అని ఇప్పటికే ప్రధాని మోడీ క్లియర్‌గా చెప్పారని గుర్తుచేశారు. అయినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఒక మతానికి పరిమితం కాదని.. అన్ని మతాలను గౌరవిస్తుందని అన్నారు. జనాల్ని ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12కు పైగా సీట్లు గెలుస్తామని, కేంద్రంలో 400 మార్కును టచ్ చేస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 50 సీట్లకు మించి రావని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూడా అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోబోతోందని అన్నారు. ఇక బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని సెటైర్ వేశారు. ఆ పార్టీ ఎవరికీ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కనిపించడం కష్టమే అని అనుమానం వ్యక్తం చేశారు.