కేటీఆర్‌కు బండి సంజయ్ సంచలన సవాల్

by GSrikanth |   ( Updated:2024-03-07 16:44:53.0  )
కేటీఆర్‌కు బండి సంజయ్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సవాల్ చేశారు. గురువారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరీంనగర్‌కు ఎవరేం చేశారో చర్చించేందుకు తాను రెడీ అని కేటీఆర్ చాలెంజ్ చేశారు. అభివృద్ధి, రామమందిరంపై ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే కరీంనగర్‌లో తిరగలేరు అని సీరియస్ అయ్యారు.



Advertisement

Next Story