- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ అసమర్థత వల్ల 8 వేల కోట్లు నష్టం: నారా లోకేష్
వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అసమర్థత వల్ల రాష్ట్రానికి 8 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు బాబు హయాంలో 55,648.67 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఆమోదం పొందిందితే.. రివర్స్ టెండరిగ్ వల్ల 8 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచుతాం, చేతులు వంచుతాం అన్న జగన్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఆయన అన్నారు. పనులూ జరగడం లేదని విమర్శించారు. అంచనా వ్యయం తగ్గించడం వల్ల 8 వేల కోట్ల రూపాయల నష్టంతో పాటు, పోలవరం పవర్ ప్రాజెక్ట్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా అడుగుతోందని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు కోసం బాబు హయాంలో ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి తెచ్చుకోలేరు. కొత్తగా ప్రాజెక్టులు తెచ్చుకోలేరు. ఇంకేం చేయగలరని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
tags : tdp, lokesh, twitter, ysrcp, jagan, polavaram