- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చట్టాలతో రైతులకు మేలు : జయప్రకాశ్ నారాయణ్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే తప్ప హాని చేసేవి కాదని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతుల గుండెల్లో ఎంతో వేదన ఉందన్నారు. మొహం మీద కోపంతో ముక్కు కోసుకున్నట్టు రైతుల ఉద్యమం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టం వల్ల రైతులు ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చని తెలిపారు. రైతులకు వీలుగా ధర ఎక్కడ ఎక్కువ వస్తే.. అక్కడ పంట అమ్ముకునే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఈ నూతన చట్టాలతో రైతులకు ఉన్న సంకెళ్తు తెంచారని వివరించారు. పంట నిల్వ చేయడం మూలంగా రేట్లు పెరుగుతాయే తప్ప తగ్గవని తెలిపారు. ఇప్పటివరకూ బంగాళదుంప రైతులు నష్టపోయిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే రైతులు ఇప్పటివరకూ నష్టపోయారని అన్నారు. ఈ చట్టాలపై రైతులు అపోహలకు గురికావొద్దని అవగహన కల్పించారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో రైతుకు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో చట్టాలు చాలా బలంగా ఉన్నాయని గుర్తు చేశారు.