- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సర్కార్ ఆస్పత్రికి తాళం.. పురిటినొప్పులతో ‘తల్లి’డిల్లె…
by Shyam |
దిశ, నల్లగొండ: ప్రభుత్వాస్పత్రులను మెరుగుపర్చామని పాలకులు ఎంత చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణే మఠంపల్లిలో జరిగిన ఘటన. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలకేంద్రంలోని సాగర్ సిమెంట్ కంపెనీలో పనిచేసే ఓ కార్మికుడి భార్య శాంతాదేవికి శనివారం ఉదయం పురిటినొప్పులు రాగా ఓ వాహనాన్ని కిరాయి తీసుకొని ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. కానీ, అక్కడకి వెళ్లేసరికి ఆస్పత్రి గేటుకు తాళం వేసి ఉండటంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గేటు వద్దే ఉండిపోయింది. సుమారు 2 గంటలు గేటు ముందే నొప్పులతో బాధపడి పండంటి మగబిడ్డకు జన్మిచ్చింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న సిబ్బంది పీహెచ్‌సీ తల్లిబిడ్డను హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం దృష్టికి రాలేదని, విచారణ చేస్తానని డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Advertisement
Next Story