నాయకుడే లాక్‌డౌన్ ఉల్లం‘ఘనుడు’!

by Shyam |
నాయకుడే లాక్‌డౌన్ ఉల్లం‘ఘనుడు’!
X

దిశ, మహబూబ్‌నగర్: ఆయన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్. జిల్లాకు చెందిన ఒక కీలక నేత అనుచరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. మంచి నాయకుడిగా పేరుంది. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి విజృంభిస్తున్న ఈ వేళ ప్రజలకు సేవ యాల్సిందిపోయి ఆయన కీడు చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించేలా తానే నాయకత్వం వహించి కరోనాపై చైతన్యం కలిగించాల్సిందిపోయి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తనకున్న పలుకుబడితో సిటీ నడిబొడ్డున మద్యం విక్రయిస్తున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో మద్యం షాపులు మూతబడిన సంగతి తెలిసిందే. అయితే, చాలా వరకు మద్యం విక్రయదారుల వద్ద ఉన్న మద్యం నిల్వలు దాదాపుగా ఖాళీ అయ్యాయి. దీంతో సదరు నాయకుడు రంగంలోకి దిగి తన వద్ద ఉన్న మద్యం స్టాక్‌ను విక్రయించడం మొదలుపెట్టాడు.

జిల్లా కేంద్రం నడిబొడ్డున…

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఒక పెద్ద హోటల్‌కు బార్ లైసెన్స్ ఉంది. గతంలో ఈ హోటల్‌ను నడిపించలేకపోయిన హక్కుదారులు దానిని లీజ్‌పై కొంతమందికి ఇచ్చారు. ఈ లీజ్‌దారుల్లో ఒక్కరైన సదరు నాయకుడు ప్రస్తుతం రంగ ప్రవేశం చేసి ఈ దందా చేస్తున్నాడు. మార్కెట్‌ ధరలకు నాలుగింతలు పెంచి మద్యం అమ్ముతున్నారనీ సమాచారం. అయితే, జిల్లాకు చెందిన కీలక నాయకునికి అనుచరుడిగా ఉండటం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారు ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: market committee ex chairman, leader, covid 19 affect, lockdown, violation, officers, no action

Advertisement

Next Story

Most Viewed