- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో లాక్‌డౌన్
దిశ, జహీరాబాద్: కరోనాను అరికట్టడానికి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. తాజాగా జహీరాబాద్ నియోజకవర్గంలో గల ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ పంచాయతీ పాలకవర్గం నేటి నుండి 15వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు గ్రామ సర్పంచ్ శివలక్ష్మి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ వెల్లడించారు, పంచాయతీ తీర్మానించిన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు రాకూడదని అన్నారు. వ్యవసాయ పనులు యధావిధిగా కొనసాగించుకోవచ్చన్నారు. ఇదిలా ఉంటే.. గ్రామంలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పంచాయతి సిబ్బంది గ్రామంలోని పలు వార్డులు, పలు కూడళ్లలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.