- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెల్లో లాక్ డౌన్
దిశ, ఖానాపూర్: పల్లెల్లో రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయపడిపోతున్నారు. యువకులు కరోనా కాటుకు మృతిచెందుతున్నారు. పల్లెల్లో, గ్రామమాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేసి ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇది ఎక్కడో కాదు.. నిర్మల్ జిల్లా కడం మండలంలోని కొత్త మద్దిపడ, పాత మద్దిపడ గ్రామంలో గత 20 రోజుల నుండి కరోనా కాటుకు 10మంది మృతి చెందారు. అదే గ్రామంలో ఓకే కుటుంబంలోని ముగ్గురు యండి నసిర్, యండి జమీర్, ఫాహిమ బేగం కరోనా కాటుకు మృతిచెందగా.. అదే కుటుంబనికి చెందిన యండి మునిర్ కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక అదే గ్రామానికి చెందిన పాదం బుచ్చన్న కరోనాతో మరణించాడు. రోజు రోజుకు కోవిడ్ మరణాలతో గ్రామాల్లోని ప్రజలు గుబులు చెందుతున్నారు. కోవిడ్ విజృంభించడంతో గ్రామంలో స్వచ్చందంగా లాక్ డౌన్ విధించారు. కొంతమంది గ్రామాన్ని విడిచి పక్క గ్రామంలోని బంధువుల ఇండ్లలో ఉంటున్నారు.