లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమ‌లు చేయాలి: మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమ‌లు చేయాలి:  మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: క‌రోనా వైర‌స్ నియంత్రణకు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో లాక్‌డౌన్‌ను ప‌క‌డ్బందీగా అమలు చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. బుధవారం జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ఆయన టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 4,81 345 ఎక‌రాల్లో ధాన్యం పండ‌గా, 11,68,389 మెట్రిక్ ట‌న్నుల దిగుబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. మొత్తం 895 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల‌ని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 566 కొనుగోలు కేంద్రాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, మిగ‌తా కొనుగోలు కేంద్రాల‌ను సాధ్య‌మైనంత త్వరగా ప్రారంభించాల‌న్నారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 117కు 35, భూపాలప‌ల్లి జిల్లాలో 182కు 15 కేంద్రాలు మాత్ర‌మే ప్రారంభ‌మ‌య్యాయని తెలిపారు. అయితే, ఆ రెండు జిల్లాల్లో పంట‌లు ఆల‌స్యంగా వేయడంతో దిగుబ‌డి నెమ్మదిగా వచ్చే అవకాశం ఉందన్నారు. జ‌న‌గామ‌లో 186 సెంట‌ర్లు ప్రారంభం కావాల్సి ఉండ‌గా నేటికి 182 సెంటర్లు ప‌ని చేస్తున్నాయని, మిగ‌తా 4 సెంట‌ర్లు త్వ‌ర‌లో ప‌నిచేసేలా చూడాలన్నారు. గ‌న్నీ బ్యాగుల కొర‌త ఉంద‌ని రైతులు చెబుతున్నారని, మొత్తం 21 ల‌క్ష‌ల గ‌న్నీ బ్యాగుల్లో ఇంకా 6ల‌క్ష‌ల బ్యాగులు రావాల్సి ఉందన్నారు. అవి త్వరగా తెప్పించాల‌ని జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల‌ను మంత్రి కోరారు. మిల్ల‌ర్ల నుంచి కూడా పాత గ‌న్నీ బ్యాగులు ఏమైనా ఉంటే సేకరించాలని వివరించారు. ప్ర‌స్తుత దిగుబ‌డి 2ల‌క్ష‌ల 75వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం నిలువ‌కు స‌రిప‌డా గోదాముల‌ను ముందే సిద్ధం చేసుకోవాల‌న్నారు. ఇక వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలోనూ 86వేల 780ఎక‌రాల్లో 2 ల‌క్ష‌ల 8వేల 186 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డులు వ‌స్తాయ‌ని భావిస్తున్నట్టు మంతి ఎర్రబెల్లి పేర్కొన్నారు. దానికి సరిపడా 117 సెంట‌ర్ల‌కు కేవ‌లం 35 సెంట‌ర్లు మాత్ర‌మే ప్రారంభ‌మ‌య్యాయ‌ని, మిగ‌తా సెంట‌ర్లను సాధ్య‌మైనంత తొంద‌ర‌లో ప్రారంభించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రితను ఆదేశించారు. అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండి కోనుగోలు ప్రక్రియను ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

Tags: lockdown, warangal, minister errabelli dayakar, purchasing centers

Advertisement

Next Story

Most Viewed