- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జార్ఖండ్‌లో వారం రోజులు లాక్‌డౌన్
రాంచీ: జార్ఖండ్ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన ఆంక్షలను విధించింది. రాష్ట్రంలో వారం పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలవుతుందని సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం తెలిపింది. ఈ కాలంలో ఆధ్యాత్మిక ప్రాంతాలు తీసే ఉంటాయని, కానీ, భక్తులు గుమిగూడటాన్ని నిషేధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురికి మించి ఒక చోట కలవరాదని ఆదేశించింది. అత్యవసర సేవలు అందించేవి మినహా అన్ని షాపులు మూసివేయాలని పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, మినహాయించిన మరికొన్ని ఆఫీసులు మినహా అన్ని బంద్ అని వివరించింది. వ్యవసాయం, నిర్మాణరంగం, మైనింగ్ పనులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉందని తెలిపింది. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వైరస్ ట్రాన్స్‌మిషన్ చైన్ బ్రేక్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.