ఆగష్టు 14వరకు లాక్‌డౌన్ పొడగింపు..

by  |
ఆగష్టు 14వరకు లాక్‌డౌన్ పొడగింపు..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగుతూనే ఉన్నాయి. కరోనా నివారణకు మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ వంటివి వాడుతున్నా వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదు. భవిష్యత్తుల్లో మరిన్ని కేసులు నమోదు కాకుండా ఉండాలంటే లాక్‌డౌన్ తప్ప మరో పరిష్కారం లేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కేసులు ఎక్కువగా అవుతున్నందున తిరుపతిలో లాక్‌డౌన్ కొనసాగుతున్నది. గతంలో విధించిన 10 రోజుల లాక్‌డౌన్ బుధవారంతో పూర్తయింది. అయితే, లాక్‌డౌన్‌ను మరో పదిరోజులు పొడిగిస్తూ అధికారులు నిర్ణయించారు.

తాజాగా, ఆగష్టు 14వ తేదీ వరకు నిర్భంధం పొడిగిస్తూ జిల్లా అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నగరంలో వ్యాపార లావాదేవీలు చాలా వరకు మూతపడ్డాయి. తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. జారీ చేసిన టిక్కెట్ల కంటే తక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని టీటీడీ ప్రకటించింది.


Next Story

Most Viewed