- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ఇద్దరి మధ్య ‘బంధం లాక్‌డౌన్’
దిశ, వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని భయపెట్టింది. మనుషుల్ని బలి తీసుకుంది. ఎంతోమంది ఆకలి చావులకు, ఉపాధి వెతలకు కారణమైంది. మానవాళిని ఎంతో నష్టపరిచిన కరోనా వైరస్ వల్ల కొంత మంచి కూడా జరిగిందన్నది కాదనలేని వాస్తవం. పర్యావరణ కాలుష్యం తగ్గింది, గంగా నది నీళ్లు స్వచ్ఛంగా మారాయి, అందరూ గడపదాటకుండా ఇంటి సభ్యులతోనే గడిపారు.. ఇవన్నీ కూడా కరోనా వల్లే సాధ్యమయ్యాయి. ఇప్పుడు కరోనా ఖాతాలో మరో క్రెడిట్ కూడా చేరింది. అదేంటంటే.. లాక్‌డౌన్ టైమ్‌లో ‘బంధాలు’ చాలా పటిష్టమయ్యాయని తాజా సర్వేలో తేలింది.
ఉరుకుల పరుగుల జీవితాల్లో ఇంటిపట్టున ఉండేది తక్కువే. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే.. ఇక అంతే సంగతులు. కలిసి మాట్లాడుకోవడానికి కూడా టైమ్ దొరకదు. కరోనా పరుగులు పెట్టే జీవితాలకు సడెన్ బ్రేక్ వేసింది. అందర్నీ ఇంటికే పరిమితం చేసింది. దీంతో ఈ లాక్‌డౌన్ కాలంలో 47 శాతం మంది భార్యాభర్తలు తమ పార్టనర్ గురించి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారని ‘ద నాట్ వరల్డ్ వైడ్’ అనే రిలేషన్‌షిప్ హెల్త్ యాప్ చేసిన సర్వేలో తేలింది. ‘ఎట్ హోమ్ టుగెదర్’ అనే పేరుతో జరిగిన ఈ సర్వేలో సింగిల్స్, కొత్తగా పెళ్లయిన వాళ్లు, కొన్నేళ్లుగా కలిసి ఉంటున్న భార్యాభర్తలు పాల్గొన్నారు. తమ భాగస్వామితో క్వాలిటీ టైమ్‌తో పాటు, ఎక్కువ సమయం గడిపామని 90 శాతం కపుల్స్ తెలిపారు. 40 శాతం మంది తమ పార్టనర్‌తో రోజులో 18 గంటలకు పైగా కలిసి ఉన్నామన్నారు. 46 శాతం మంది తమ లైఫ్ స్టైల్‌ను మెరుగుపరుచుకునేందుకు భార్యాభర్తలిద్దరూ కలిసి మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకున్నామని తెలిపారు. 40 శాతం మంది కపుల్స్.. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ భాగస్వామిని మరింత లోతుగా అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. పది శాతం మంది కపుల్స్ మాత్రం తమ రిలేషన్ చాలా బాధను కలిగించిందని తెలిపారు.
బిజీ షెడ్యూల్:
భారతీయ సమాజం ‘కుటుంబ వ్యవస్థ’కు ప్రాధాన్యతనిస్తుంది. అయితే మారుతున్న పరిస్థితులతో పాటు టెక్నాలజీ తెచ్చిన మార్పులు, ఉద్యోగస్తుల పని వేళలు, బిజీ షెడ్యూల్స్ బంధాలను దూరం చేస్తున్నాయని ‘ద నాట్ వరల్డ్ వైడ్’ అంటోంది. తరచుగా ఫోన్ కాల్స్ మాట్లాడటం, సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం, ట్రాఫిక్ ఇబ్బందులు ఇలా ఫ్రీ టైమ్ అంతా వీటికే సరిపోతోంది, దాంతో ప్రియమైన వారికి సరైన సమయం కేటాయించలేక బంధాలు భారంగా మారుతున్నాయి. ‘లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దానివల్ల కుటుంబంలో ఆందోళన, ఒత్తిడి పెరిగాయి. కానీ భార్యాభర్తలిద్దరూ ఈ కష్టకాలంలో కలిసుండి.. కుటుంబాన్ని ముందుకు నడిపించారు. ఖాళీ సమయంలో కలిసి గడిపారు. ఒకరి పనులు మరొకరు పంచుకుని ముందుకు సాగారు. ఈ కారణాలతో పాటు ఒకరినొకరు తెలుసుకునేందుకు సమయం దొరకడం వల్ల బంధాలు మరింత బలపడ్డాయని’ ద నాట్ వరల్డ్ వైడ్ కంట్రీ హెడ్ అంకుర్ పేర్కొన్నారు.