తండ్రి చనిపోయాడని తెలియక.. ఆడుకుంటున్న సాయి తేజ కొడుకు ( వీడియో)

by srinivas |   ( Updated:2023-10-10 15:36:27.0  )
తండ్రి చనిపోయాడని తెలియక.. ఆడుకుంటున్న సాయి తేజ కొడుకు ( వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : చిన్నతనం అంటే ఏమి తెలియని తనం అంటారు. కానీ ఒకందుకు ఏమి తెలియని తనమే మంచిది అనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే. నాలుగు రోజుల క్రితం మాతృభూమి సేవలో అమరుడైన సాయితేజ కొడుకును చూస్తే ఎవరికీ కన్నీళ్లు ఆగట్లేవు. తన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలియక ఆడుకుంటున్న చిన్నారి తీరును చూసి బంధువులు రోదిస్తున్నారు.

తమిళనాడులో జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హెలికాప్టర్ దుర్ఘటనలో తెలుగు జవాన్ సాయితేజ అమరుడయ్యాడు. మాతృభూమి సేవలో అమరుడైన సాయితేజ భౌతికకాయం చిత్తూరు జిల్లాలోని తమ స్వగ్రామం ఎగువ రేగడపల్లెకు తీసుకొచ్చారు. ఎంతో మంది అతన్ని చూడటానికి చిత్తూరు జిల్లాకు వెళ్తున్నారు. అయితే అక్కడ తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలియని సాయితేజ కుమారుడిని చూసి అందరూ కన్నీటి పర్యాతం అవుతున్నారు. తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడు దేశం కోసం పోరాడుతున్నాడు అనుకుంటున్నాడేమో ఆ చిన్నారి. ఇంటికి అంత మంది జనం ఎందుకు వస్తున్నారో తెలియక వచ్చే వారిని అమాయకత్వంతో చూస్తుండిపోయాడు. అంతే కాకుండా తన తండ్రి చనిపోయాడని తెలియక ఆడుకుంటున్న సాయితేజ ఐదేళ్ళ కుమారుడు మోక్షజ్ఞని చూసినవారికి కన్నీళ్లు ఆగడం లేదు.

Advertisement

Next Story