- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎస్సైకి అభినందనలు
by Anukaran |
X
దిశ, మానకొండూరు: స్థానికుల చాకచక్యంతో ఓ నిండు ప్రాణం దక్కింది. కుటుంబ కలహాల కారణంగా తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని కాకతీయ కాలువలో బుధవారం కరీంనగర్ పట్టణానికి చెందిన మహిళ దూకింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ మహిళను అటుగా వెళ్తున్న సుందరగిరి సతీష్, దుండ్ర. ఎల్లయ్యలు కాపాడారు.
ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన ఎల్ఎండి ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లూ కోట్ హోంగార్డ్ లక్ష్మీనారాయణ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను పోలీస్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఎలాగైనా యువతి ప్రాణాలు కాపాడాలని ఆలోచనతో సొంతంగా వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఎస్సైని పలువురు అభినందించారు. ఆ మహిళను కాపాడిన సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్యలను ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
Next Story