ఇకపై ‘పైరవీలు’ నడువయ్ : TS DGP

by  |
ఇకపై ‘పైరవీలు’ నడువయ్ : TS DGP
X

గోదావరి పరీవాహక ప్రాంతం పోలీసుల పోస్టింగ్‌లపై పోలీస్ బాస్ దృష్టి సారించారు. ఆ ప్రాంతంలో పొలిటికల్ పోస్టింగ్‌లకు నో చెప్పేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతమైన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పోలీస్ అధికారులను బదిలీ చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ జిల్లాలను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాలు ఉన్నాయి.

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి పరీవాహక ప్రాంతంలో మావోయిస్టులు పట్టు సాధించి కార్యకలాపాలు జరుతున్నారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మావోయిస్టులు ఇటీవల కాలం తెలంగాణలోని పరీవాహక ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారని పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీ నిర్మాణంలో భాగంగా యూజీ కేడర్‌తో పాటు సానుభూతిపరులను రిక్రూట్ చేసుకునే పనిలో నిమగ్నం అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో పట్టున్న నాయకులను రంగంలోకి దింపిన మావోయిస్టులు కొంతమేర సానుకూల ఫలితాలను సాధించిందని అం చనా వేశాయి. ఈ మేరకు సరిహద్దు ప్రాంతా ల్లో అలెర్ట్‌గా ఉండాలని కూడా సూచించాయి.

మార్చిలోనే డీజీపీ పర్యటన..

పలు చోట్ల ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడంతో డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. మార్చిలోనే డీజీపీ పర్యటించి నక్సల్స్ ఏరివేతపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ మావోయిస్టుల కదలికలు బయటపడ్డాయి. ఈ నేఫథ్యంలో మరోసారి డీజీపీ ఐదు రోజల పాటు ఆసిఫాబాద్‌లో మకాం వేసి క్షేత్ర స్థాయిలో సమీక్ష జరిపారు. ఇదే సమయంలో బార్డర్ ఏరియా పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, సబ్ డివిజన్లలో పోస్టింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటవీ ప్రాంతాలపై పట్టులేని అధికారులకు బార్డర్ స్టేషన్లలో పోస్టింగ్ వేయకూడదని నిర్ణయించారు. అప్పటికే పోస్టింగ్ అయిన వారిని కూడా వేరే ప్రాంతానికి బదిలీ చేసి పరీవాహక ప్రాంతంపై అవగాహన ఉన్నవారినే బదిలీ చేశారు. ఇక నుంచి ఆయా జిల్లాల్లోని ఆ స్టేషన్లలో పోస్టింగ్‌ల విషయంలో పొలిటికల్ ఇన్‌వాల్వ్‌మెంట్ లేకుండా నక్సల్స్ ఏరివేతలో చురుగ్గా ఉన్నవారికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఆ గూడాలపై స్పెషల్ నజర్..

చత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతం నుంచి సరిహద్దు ప్రాంతాలకు వలస వచ్చిన గుత్తికోయల గూడేలపై ప్రత్యేక నిఘా ఉంచా లని ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుం చి తెలంగాణాలోకి వస్తున్న మావోయిస్టులు మారువేషాల్లో వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారన్న అనుమానంతో పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో దాదాపు వంద వరకు గుత్తి కోయలకు సంబంధించిన గూడాలు ఉన్నట్లు పోలీసులు గుర్తిం చారు. వీరి కదిలికలతో పాటు బంధువులుగానో తెలిసిన వారిలాగానో వీరి గూడెంలకు ఎవరైనా వచ్చినట్టయితే వారి వివరాలూ పూర్తి గా సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగారం సమీపంలోని ఓ గూడేనికి చెందిన వారిని మిలిటెంట్లుగా పోలీసులు అరెస్ట్ చేశా రు. అంతకుముందు ములుగు జిల్లా పోలీసుల ముందు లొంగిపోయిన ఓ మావోయిస్టు మహాముత్తారం మండలంలోని గుత్తికోయలతో సం బంధాలు ఉన్నాయన్న అనుమానంతో వాటిల్లో తనిఖీలు కూడా చేపట్టారు. వారి ఆవాసాలే షెల్టర్‌గా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి వర్గాలు.


Next Story

Most Viewed