‘స్థానిక’ ఓటర్ల మొబైల్స్ లాక్కున్న టీఆర్ఎస్ లీడర్స్.. మళ్లీ ఎన్నికల తర్వాతే..!

by Anukaran |
‘స్థానిక’ ఓటర్ల మొబైల్స్ లాక్కున్న టీఆర్ఎస్ లీడర్స్.. మళ్లీ ఎన్నికల తర్వాతే..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులచేత మాక్ పోలింగ్ నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మాక్ పోలింగ్ ప్రక్రియ సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే విధానంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో మాక్ పోలింగ్ చేపట్టినట్టు తెలిసింది. అయితే, మంగళవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందే వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను ముఖ్య నాయకులు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.10వ తేదిన జరిగే పోలింగ్ వరకు సెల్‌ఫోన్లు అప్పగించే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. చివరి రెండు రోజుల్లో ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయనే మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే, వీరు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేపు కేటీఆర్ భేటీ..

బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో మాట్లాడుతారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడంతో పాటు ఇతరత్రా అంశాలపై వారితో చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed