- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాన్ ఆఫ్ బాలీవుడ్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజంటే.. అభిమానులకు పండుగ రోజు. తన 30 ఏళ్ల కెరీర్‌లో అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న కింగ్ ఖాన్.. నేడు 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కాగా, ప్రతి సంవత్సరం ఈ స్పెషల్ రోజున తన ఇంటికి (మన్నత్) అభిమానులు పోటెత్తుతారు. కానీ ఈ సారి కరోనా పాండమిక్ కారణంగా.. అభిమానులెవరూ రావొద్దంటూ అభ్యర్థించాడు షారుఖ్. అంతేకాదు ఫ్యాన్స్ కోసం తనే.. వీఆర్ ద్వారా మన్నత్‌ను చూపిస్తానని మాటిచ్చాడు. ఇక తన బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి షారుఖ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
నాకు తెలిసిన అత్యంత సౌమ్యులలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఆయన ఎల్లప్పుడూ సు:ఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను – మహేశ్
లెజెండరీ, ఓపెన్ హర్టెడ్‌నెస్, ఇంటెలిజెన్స్.. ఆల్ ఇన్ వన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు – అనుష్క శర్మ
నా మొదటి హీరో, నా బాజీగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితంలో అన్ని ఆనందాలను పొందాలని ఆశిస్తున్నాను – శిల్పాశెట్టి
‘మనం కలిసినప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో మ్యాజిక్ జరుగుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. త్వరలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా- మాధురి దీక్షిత్
Whenever we meet, there's masti, magic & loads of love ♥️ Here's wishing you a very happy birthday @iamsrk. Stay safe & hope to see you soon. pic.twitter.com/mpWMnJq1Ol
— Madhuri Dixit Nene (@MadhuriDixit) November 2, 2020
‘హ్యాపీ బర్త్ డే టు యూ సర్. మీ పాటలకు స్కూల్ ఫంక్షన్స్‌లో డ్యాన్స్‌లు వేసేవాడిని. మీ ఇంటి బయట గంటల తరబడి నిలబడేవాడిని. అలాంటిది ఇప్పుడు మీతో కలిసి స్టేజ్ పంచుకుంటున్నాను. మీతో మాట్లాడటం ఎంతో గొప్ప అనుభూతి. నాకో గర్వకారణం. లవ్ యు ఎలాట్. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నాను’ – రాజ్ కుమార్ రావు.
Happy birthday @iamsrk sir. From dancing on ur songs in all my school functions to standing outside ur house for hours & to sharing stage wid u & having such wonderful conversations wid u. It’s always such an honour. I love u a lot & will alwys pray for ur good health & happiness pic.twitter.com/U1V4BTNnXh
— Rajkummar Rao (@RajkummarRao) November 2, 2020
డాన్ ఆఫ్ బాలీవుడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు – ఇషా కొప్పికర్
షారుక్ బర్త్ డే సందర్భంగా.. అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా షారుఖ్ పేరు మీద 500 చెట్లు నాటింది. ఇక కరీనా కపూర్, డబూ రత్నానీ, ఫరా ఖాన్, మాధవన్, సునీల్ శెట్టి, రితేష్ దేశ్‌ముఖ్, లారాదత్తాతో పాటు పలువురు సెలెబ్రిటీలు షారుఖ్‌కు విషెస్ తెలిపారు.