కుక్కలాగా నిద్రపోయి 256 ఏళ్లు బ్రతికాడా

by Anukaran |   ( Updated:2021-02-23 06:20:49.0  )
కుక్కలాగా నిద్రపోయి 256 ఏళ్లు బ్రతికాడా
X

దిశ,వెబ్‌డెస్క్: అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం వారణాసిలో మహష్టి మురాసి అనే వ్యక్తి (179 ఏళ్లు) బ్రతికాడని గొప్పలు చెప్పుకున్నాం. నేషనల్ మీడియా సైతం ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. అతనే ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అని గిన్నిస్ బుక్లో రికార్డ్ చేశారు. ఇంతకంటే.. ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలిగిన వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నారా..? అంటే అనుమానం వ్యక్తం చేస్తాం. కానీ 256 సంవత్సరాలు బ్రతికినవారు ఉన్నారు.

లీచింగ్ యుయెన్ వయస్సు (256) సంవత్సరాలు. ఈరోజుల్లో 70 సంవత్సరాలు బ్రతుకుతాం. మహా అయితే 100ఏళ్లు బ్రతుకుతాం. అంతకంటే మరో పదేళ్ళు ఎక్కువగా జీవించి ఉన్నారా అంటే ఆ సంగతి మనకు తెలియదు. కానీ లీచింగ్ యుయెన్ 256 ఏళ్లు బ్రతికాడు. వినడానికి ఆశ్చర్యంగా.. ఇంకొంచెం వింతగా ఉన్నా ఇదే నిజం.

చెంగ్డూ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న వు చుంగ్.., చై న్యూయార్క్ టైమ్స్ కు తెలిపిన వివరాల ప్రకారం… చైనాలో జన్మించిన “లి చింగ్ యుయెన్” అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికాడు. 1677లో జన్మించిన లిచింగ్ 1928లో మరణించారు. వాస్తవానికి, ఆ రోజుల్లో సరైన రికార్డ్‌లు లేనందున లి చింగ్-యుయెన్ అలియాస్ లి చింగ్ యున్ కూడా ఎక్కువ కాలం జీవించి ఉండవచ్చని కొందరు అంటున్నారు.

లి చింగ్-యుయెన్ చరిత్ర ప్రకారం.. లింజై, గోజీ బెర్రీ, జిన్సెంగ్, గోటుకోలా వంటి ఔషద మూలికల్ని తీసుకోవడం వల్ల ఇన్నేళ్లు బ్రతికినట్లు తెలుస్తోంది. దీంతో పాటు శృంగార జీవితాన్ని ఆస్వాధించడం వల్లే సాధ్యమైనట్లు తెలుస్తోంది. అతనికి మొత్తం 23 మంది భార్యలు ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. మానసిక ప్రశాంతత, తాబేలులా కూర్చోవడం, కుక్కలాగా నిద్రించండం వల్లే లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికాడు.

Advertisement

Next Story