కవిత: కళా తపస్వి

by Ravi |   ( Updated:2023-02-06 02:04:04.0  )
కవిత: కళా తపస్వి
X

పెదపులివర్రులో జన్మించిన

సాహితీకిరణమా!

సంగీతాభిలాషతో సినీ రంగాన

ప్రవేశించిన ఆణిముత్యమా!!

స్టూడియో సౌండ్ రికార్డిస్డ్‌గా

మొదలైన మీ సినీ ప్రస్థానం

అద్భుత చలన చిత్రాలకు పురుడుపోసెనా!

దర్శకునిగా కీర్తినాపాదించెనా!

సాంస్కృతిక విలువలకు ఊపిరిగా

సాగెను మీ ప్రయాణం!

అచ్చెరువొందు కళాఖండాలుగా

వినుతి కెక్కెను మీ హస్తముద్రలు!

సిరిసిరి మువ్వతో

సాహితీ వినీలాకాశంలో

ధృవతారగా వెలిగితిరా!

సంగీత ప్రాముఖ్య చిత్రాలతో

కళలకు పునరుజ్జీవం

పోసిన ఓ ...కళాతపస్వి!

స్వాతి కిరణం, స్వర్ణ కమలం

శంకరాభరణం.. నీ ఒడిలో సేదదీరెనే!

ప్రజాదరణ పొంది మీకు వన్నెలనద్దెనే!!

ఓ కాశీనాథుని విశ్వనాథ!

మీరు సినీ గగనపు వెండి జాబిలై

ప్రేక్షకలోకానికి చలన చిత్ర వెన్నెలలు పంచితిరా!!

మీరు పరలోకం ప్రయాణమై

అభిమానులకు అశ్రువులను మిగిల్చితిరా!

సినీపరిశ్రమకు తీరనిలోటు కలిగించితిరా!!

- అయిత అనిత

జగిత్యాల

Also Read.


కవిత: విముక్తి పయనం!!

Advertisement

Next Story

Most Viewed