ఒచ్చేశా...!

by Ravi |   ( Updated:2023-08-27 18:45:51.0  )
ఒచ్చేశా...!
X

చందమామ వచ్చా జాబిల్లి వచ్చా

కలల మెట్లన్నెక్కీ ఎంచక్కగొచ్చా ॥

ఒళ్ళంత మైమరచి ఏమిటా చూపూ

మీద నిలుచున్నానూ కళ్ళెత్తి చూడూ ॥

నినుచూచి నీతోనె ఆడేందుకొచ్చా

మామయ్య నీతోడె ఉండేందుకొచ్చా ॥

గోరుముద్దలు పెడ్తూ అమ్మ చూపే నిన్ను

అసలేంటో నిజమేంటో చూసేందుకొచ్చా ॥

తాకేసి చుట్టేసీ పాడేందుకొచ్చా

చప్పట్లు చరిచేస్తూ గెంతేందుకొచ్చా ॥

అమ్మతో నీ కబురు చెప్పేందుకొచ్చా

చల్లనీ నీ మనసూ తెలిపేందుకొచ్చా

తెల్లనీ గుండెల్లో వెతికేందుకొచ్చా

దారి తెలిసిందోచ్ ఇంక నే వస్తుంటా ॥

- ఏటుకూరి ప్రసాద్

04027638247

Advertisement

Next Story

Most Viewed