- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా పల్లె రమ్మంటోంది
నా పల్లె రమ్మంటోంది
కన్న తల్లి పాలు త్రాగిన చోటును
ఓ సారి చూసి పొమ్మని..
నా పల్లె రమ్మంటోంది
బుడి బుడి అడుగులు వేసిన
నీ ఇంటిని ఒక్కసారి చూసి పొమ్మని..
నా పల్లె రమ్మంటోంది
అ, ఆ లు దిద్దిన చిన్న బడిని
పలకరించి పొమ్మని..
నా పల్లె రమ్మంటోంది
నీ మల మూత్రాలు
అక్కున జేర్చుకున్న మడికట్లు
నెర్రెలిచ్చి ఎదిరి చూస్తున్నవని..
నా పల్లె రమ్మంటోంది
నీవు ఈత నేర్చిన చెరువు గట్టు
పిల్ల గాలి పీల్చి పొమ్మని..
నా పల్లె రమ్మంటోంది
మీ ఇంటి కాడి చేదబాయి
గుక్కెడు నీళ్ళు త్రాగి పొమ్మని..
నా పల్లె రమ్మంటోంది
నీవు పెరిగి పెద్దయిన
ఇంటి పెరటి గోడలు బోసి బోయినవని...
నా పల్లె రమ్మంటోంది
అంగట్లో పప్పు బెల్లాలు
కొనుకున్న కొట్టు దిగాలుగా ఉందని..
నా పల్లె రమ్మంటోంది
బస్టాండ్ లో ఇరగ పూసిన
చింత చెట్టు చిగురు రుచి చూడమని..
నా పల్లె రమ్మంటోంది
బతుకు పాఠాలు నేర్పిన
పెద్ద బడిని మరచి పోయావా అని..
నా పల్లె రమ్మంటోంది
విశ్రాంత జీవితమైనా
ప్రశాంతంగా గడపమని..
నా పల్లె రమ్మంటోంది
ఊరు పడమట ఉన్న చెరువు గట్టు
తూర్పున ఉన్న ముత్యాలమ్మ మర్రి చెట్టు
ఉత్తరాన ఉన్న ఊట బావి
దక్షిణాన ఉన్న కోమటి కుంట
నీ రాక కోసం చూస్తున్నవని..
నాకూ వెళ్ళాలనే ఉంది..
కానీ కని పెంచిన అమ్మా నాన్నలు
కలవబోరు అని..
అయ్య కట్టిన ఇంటి
మొండి గోడలు వెక్కిరిస్తాయని,
చిన్న నాటి స్నేహితులు
చెల్లా చెదరై పోయారని..
సదువు చెప్పిన పంతుల్ల
సందడి లేదని.. వెళ్ళినా
గుర్తు పట్టే నా వాళ్ళు లేరని..
అయినా వెళతాను...
కన్న తల్లి జ్ఞాపకాలు
నెమరు వేసుకోవడానికి..
బాల్యంలోని మధుర స్మృతులు
ఆస్వాదించడానికి..
అయినా వెళతాను...
పుట్టినూరు రుణం తీర్చుకోవడానికి
గట్టి మేలు తల పెట్టడానికి..
శిరందాస్ శ్రీనివాస్
94416 73339
- Tags
- Poem