- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూసీ
పాపికొండల నడుమ
పాలయేరు సాగిపోతున్నట్టు
అలల రెక్కల నీటిగుర్రం
ఎగిరెగిరి పరుగెడుతున్నట్టు..
పల్లెల అంచున నాగళ్లకు పనిచెబుతూ
రైతు కంట కన్నీరు తుడిచే పన్నీటివాగు
ఒక్కో పువ్వు ముడేసుకుంటూ
అల్లుకుపోయే పూలదారంలా..
ఒక్కో ఊరును కలుపుతూ పోయే జీవధార
చాకలి మెచ్చిన చాకిరేవు
మత్స్యకారుల బ్రతుకు దెరువు
నాడు ఆరోగ్యానికి
ఆయువు ఎక్కించిన సెలైన్
నేడు ఫ్యాక్టరీ వ్యర్ధాలతో
చేతులు కలిపి విషనాగులా
బుసలు కొడుతున్నది
ఆ యేటిగట్టు తాటిపేరు చెబితే
కల్లు ప్రేమికులు.. భళ్లున గుండె పగిలే
వాంతి అవుతున్నరు..
ఆ నీటి చేపలంటే
కౌసు ప్రియులు ముఖం తిప్పుకుని
శాకాహారులం అంటున్నరు
ఆ మట్టి కుండే అంటే
పిసినారి కూడా ఫ్రిజ్ వైపే మొగ్గుతున్నడు
ఇప్పుడు మూసీనది అంటే
బుడ్డపర్కల్లెక్క
ఈదులాడిన మిత్రుల జ్ఞాపకం
జంతు ప్రేమికుల
జంతుజాలము గొడ్డువోతున్నది
పశు పక్షాదుల పుట్టుక
ప్రమాదంలో ఉన్నది
పండిన మెతుకు కూడా
ప్రాణం పిందెలా
రాలిపోయే విషమవుతున్నది
రోగం రొష్టుల ముంపు బాధితులం
ప్రమాదం పొంగి పొర్లుతున్నది
మా తలరాత మీ చేతుల్లో పెట్టినం
ముత్యం మసిబారుతున్నది
శుద్ధి జరగాలి
అభిషేకం జరిపించి
నిజరూప దర్శనం ఇప్పించండి సారూ.
- గజ్జెల రామకృష్ణ
89774 12795
- Tags
- Poem