- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీకటి గది
చీకటి నిండిన గదిలో
నేనొక బందీని, బంధాలు లేని
బలి పశువుని
కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న
గడ్డి పోచకు ఆధారం దొరికే వరకు
ప్రయాణం తప్పదు
నా గుండె లోతుల్లో నిండిన ఆత్మీయ భావాలు
పిలిచినట్టున్న, నేను మౌనమే దీక్ష భూనినట్టు
మూగబోయిన గొంతుతో లోలోపల
చేసుకున్న భాసల ఆశల మూగ భాషలు
కళ్ళు చేమర్చే వేళ చేతులు అందంగా అడ్డముంచి
కనబడని భావాలకు భాష్యం చెప్పేదెవరు?
నేనే రాతల వాల్మీకి నై, నేనే గీతల రంగవల్లినై
నేనే నడకల మయూరినై, నేనే మాటల మరాఠినై
చీకటి నిండిన గది నుండి విడుదలైతే బాగుండునని
కోతలకు గురైన కాలువకు నీటి గండంమున్నట్టే
నడుస్తున్న నా కాళ్లకున్న వేగమే
బందీయై నిలచింది
రవికి అనేక కోణాలున్నట్టు
జీవితపు మలుపులో అనేక రీతులు
చీకటిలో కళ్ళు మూసుకున్న
జీవికి లోకంతో పనిలేదు
సాహసమనే గూటిలోకి చేరితేనే
జీవనం సాఫల్యం
తెలుసుకునే లోపే చీకటి గది కిటికీలోంచి
వెలుతురు నా వైపుకే వచ్చినట్టు
కండ్లు తెరిచి చూసా అంతా శూన్యమే.
- బొమ్మిదేని రాజేశ్వరి
90527 44215
- Tags
- Poem