వరద వేదన

by Ravi |   ( Updated:2024-09-15 18:30:53.0  )
వరద వేదన
X

అయ్యో నేను

నా జీవితంలో

కలగనలేదే

కాలానికి ప్రకృతికి

బలి అవుతానని

తెలియకనే

నాలో అసూయ ద్వేషం

స్వార్థం కులం మతం

అన్ని నింపుకున్నానే

ధనికుడనని గర్వంతో

ఎగసి పడితేనే

అయ్యో

నే నెరగలేదు

మానవత్వం ముందు

కులం మతం సరితూగవని

అయ్యో నేను

ఊహించనే లేదే

నా కడుపు కేకలు వేస్తేనే

ఆకలి మంటలతో

అలమటించుట ఎరిగితినని

అయ్యో మిడిసి పడితినే

నా అద్దాల మేడలు

గోడలు తడిసి ముద్దాయెనే

అయ్యో విర్రవీగితినే

బలమున్నదని ధనమున్నదని

నేడు నిస్సహాయ స్థితికి దిగజారితినే

నా గుండె అదిరేనే ప్రకృతి

విలయ తాండవానికి జడిసితిని

అయ్యో ఏనాటి పాపమో

ఈ తల్లుల కడుపుకోత

తీర్చగలనా!!!

అయ్యో నా ఈ పరిస్థితికి

నేనే కారణమా! నేనేనా!!

స్వార్థ పూరిత

ఆశల అకృత్యాలకు

బలి కాబడి

బలహీనులమయినాము....

పద్మా పోనుగోటి

87903 41580

Advertisement

Next Story

Most Viewed