- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాలిపోతున్న కాగితం
ఉన్నట్టుండి సాహిత్యపు వాసన
నా వైపు వస్తోంది
దూరంగా కాలుతున్న కాగితాల్లో నుండి
గుర్తు తెలియని మనుషులు
లేచి ఒళ్ళు దులుపుకుంటున్నారు
ఎవరని అడిగాను
విరిగిపోయిన అక్షరాల్లో
తగలబడుతున్న భావాలం
కలం నాటిన విత్తనాలం
అని చెప్పారు
కొన్ని సంవత్సరాలుగా కాగితాలపై
పుట్టి ఒక రోజు రాలుతున్న వెన్నెలను
ఇంకో రోజు ఒలికిపోయే సుగంధాన్ని
రుచి చూస్తూ క్షణక్షణం చరిత్రలో
మిగిలిన వాళ్ళం అని అంటున్నారు
లేని లోకాలను పుట్టిస్తాం
తెలియని భ్రాంతిని
మాయను చూపిస్తాం
అందం అనే అర్థాన్ని తయారు చేస్తాం
ఎంతో మందిని గొప్పవారిగా
ముద్రలు వేశాం
చీకటిలో కలం పట్టిన చంద్రుడిని
వెన్నెలలా కాపాలా ఉన్నాం
మంచు కొండల్లో వీరులని
మా వీపుపై మోసాం
యుద్ధ నౌకలను దాచుకున్నాం
శత్రువులపై యుద్ధం చేశాం
కవితల తూటాలను తయారు చేశాం
కాలాన్ని దాటిన మేము
కాలాన్ని ఎదిరించిన మేము
చేతకాని చిత్తు కాగితాలుగా
సందుల్లోకి విసిరి వేయబడ్డాం
అని వీరగాథను వినిపిస్తున్నారు
బాధతో నా గుండె వేగం పెరిగి
ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్లి
కవితలు రాసే చంద్రుడిగా
కలం పట్టాను
- నవ
91779 31900
- Tags
- poem