- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగ్నిపరీక్ష ఓటరుకే
మోరీలు కడితే కౌన్సిలర్లు కారు
ప్రాజెక్టులు కడితే ఎంఎల్ఎలు కారు
నోటు పునాదులపై మొలిచే
మున్సిపాలిటీ సీటైన అసెంబ్లీ చోటైన
సీసలు బాసలు
వీధివీధినా సిగ్గుమాలిన బాగోతాల నమోదు
గుదిగుచ్చిన మార్గదర్శక పారదర్శక సూత్రాలే అరుదు
నమస్కరించిన వాళ్ళంతా
సచ్చీలురా సత్య నిష్టాగరిస్టులా
పదవులపై చూపులు ప్రజలపై మోపులు
పట్టుబడిన పగటిచోరులు కొందరు
పట్టుబడి బైటపడినహారులు మరికొందరు
పోటెత్తిన పోటీలో పోటుగాళ్లే అందరూ
అన్ని సీమల్లోనూ
ప్రజాతంత్ర దళారుల క్షీణ ధోరణుల వక్ర రాజకీయం
అన్ని పేటల్లోనూ
ప్రజాస్వామ్య తలారుల అల్పస్వభావాల చక్రారాజకీయం
ఇక చెడుగుల క్షాళన కల్ల
సామ్యవాద సౌమ్య బోధ భావనలిక డొల్ల
ఏ పార్టీ వాళ్ళు ప్రయోజనాల పరిరక్షణకై నిలబడ్డారు
ఒంటరిగానో సమూహంగానో కూలబడ్దారు
అభివృద్ధి వ్యూహాలను
అంతర్గత మొహాలను
వుడికించే ప్రసంగాలతో ఉద్రేకపు వ్యాసంగాలతో
అన్వయించలేని అగాధాలతో మూలబడ్డారు
అగ్నిపరీక్ష ఓటరుకే
చించేది ఆలోచించేది ఎవర్నివుంచేది ఓటరే
అరాచకీయ మదగజాన్ని విదిలించే అంకుశం
ఎప్పటికీ ఓటే
కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- poem