- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రేమిస్తూనే ఉంటా
నా ఊపిరి ఆగనంత వరకూ నిన్ను
ప్రేమిస్తూనే ఉంటా
నీకు అమ్మైనా, నాన్నైనా,
పక్కింటి విశాలాక్షయినా,
ఎదురింటి మరెవరో అయినా ఒకటే!
తన పర, తర తమ
భేదం తెలీని నువ్వు
అందరినీ ఒకేలా ప్రేమిస్తావు
వాళ్ళ చూపుల్లో జాలి,
చులకన, వింత, విచిత్రం
నీకేవీ అర్థం కావు
ఆ భావనల అనుభూతి నాది!
రెక్కలొచ్చిన పక్షులు గూడు
వెతుక్కుంటూ తల్లి పక్షిని వదిలేస్తాయి
నువ్వు ఎప్పటికీ రెక్కలు రాని పసి కూనవే!
నీకు పాటలు నేర్పటానికి
నీతో ఆడటానికి, ఆటస్థలంలో
చేయి పట్టుకొని నడవడానికి
నన్నే ఇష్టపడే నువ్వంటే
నాకు చెప్పలేని ప్రేమ!
నాకు అమ్మతనాన్నిచ్చి, ఆ పిలుపులో
మాధుర్యాన్ని రుచి చూపించావు
నాకో ప్రత్యేకమైన గుర్తింపు నిచ్చావు
అందుకే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా..
ప్రతి క్షణం నా చుట్టూనే తిరుగుతూ,
నన్నంటి పెట్టుకుని, నా జీవితపు
పందిరికి లతలా అల్లుకు పోయావు
లోకం పోకడ తెలీక పోయినా
నీకు అన్నీ ఈ అమ్మే
అని తెలుసని నాకు తెలుసు
అది చాలదా.. అందుకే నిన్ను
అనుక్షణం ప్రేమిస్తూనే ఉంటా!
- డా. చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- poem