కూసింత దయ

by Ravi |   ( Updated:2023-07-23 18:31:02.0  )
కూసింత దయ
X

చేపలు పట్టడమే కాదు

తినడం కూడా రాదు

చిన్నప్పుడూ ఇప్పుడూ

ముల్లురాకుండా ఒక్కో ముక్కని

అమ్మ ఒలిచి పెడితేనే తినేది

“నువ్వు తిన్నవానె”ని

తిరిగి అడిగింది లేదు

అప్పుడంటే చిన్నతనం

ఇప్పటి అడగనితనం

కొడుకు పుట్టువడికే

చిన్నతనం


పిన్నంశెట్టి కిషన్

9700230310

Advertisement

Next Story

Most Viewed