కురిసే చినుకు నేనౌతా..

by Ravi |   ( Updated:2023-07-16 18:30:54.0  )
కురిసే చినుకు నేనౌతా..
X

మేఘం నీవైతే..

చల్లగాలినై నిను ఆర్తిగా తాకనా

నా ప్రేమ తాకిడికి నీ మనసు కరిగిపోగా

కురిసే చినుకులా నేను మారనా..!

మేఘం నీవైతే..

ఆకాశంగా నేమారిపోయి

నీకోసం

నా హృదయాన్నే కానుకగా ఇవ్వనా..!

మేఘం నీవైతే..

నువ్వు కరిగి నీరవ్వగానే

నిన్ను ఒడిసిపట్టి

నాలో కలిపేసుకునేందుకు

పుడమిలా మారిపోనా..!

మేఘం నీవైతే..

నీలో దాచుకున్న జలధారనంతా

వానజల్లుగా కురిపించి

రైతన్నలకే కానుకగా అందించమని

వేడుకునే భక్తురాలినే నేనవ్వనా..!

మేఘం నీవైతే..

నీ మీదెక్కి సవారీ చేయాలని కోరుకుంటూ

ఆకాశాన్ని ముద్దాడాలని కోరుకునే చంటి పిల్లనే నేనవ్వనా..!

దేవలపల్లి సునంద

8297744716

Advertisement

Next Story