- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత: నిత్యబాలింత కాలం
పాత సంవత్సరంలో
సంక్షేమ సంక్షోభ కాలం ఒకవైపు
సంధి కాలము మరోవైపు
కవిగా కాలాన్ని కరగదీస్తుంటాను
అలా మనం అనుకుంటాం కానీ
అప్పులు లేకుండా బతకాలని
మన రాష్ట్రం దేశం చేసిన రుణం
దారుణంగా మన మీద
దో ఘోడా సవారి చేస్తుంది
మనకేంది అనుకుంటాం
అన్ని రేట్లు పైపైకి ఎగసిపడుకుంటాయి
పేటీఎం లో అన్ని పద్ధులను చెల్లిస్తుంటాం
నీ విలువలు నీ నిల్వలు
నువ్వు చూస్తూ చూస్తుండగానే
తరిగి పోయి వెక్కిరిస్తుంటాయి
కదిలి కవిగా కాలాన్ని అదిలిస్తుంటాను
వాస్తవంగా చాలా వాటిలో
కేవలం మనం ప్రేక్షకులమే
ప్రశ్న స్వరం తప్పి పదును కోల్పోయి
పది మందిలో నవ్వులాటవుతుంది
నిజంగా చాలా వాటిలో
మన ప్రమేయం ఉండదు
కానీ మనం మౌనంగా
భరించక అనుభవించక తప్పదు
నిరంతరం నామీద పై చేయి
సాధించాలనుకునే
నిత్యబాలింత కాలానికి
సూర్యుడే మా మంగలి బుచ్చవ్వ మంత్రసాని
కవిగా అన్ని నియమాలను
నియంతలను నియంత్రణలను
కాలదన్ని నిండా చలికాలంలో
మొక్క పూలు పూసినంత
సహజాతి సహజంగా కవిగా ప్రవహిస్తుంటాను
క్యాలెండర్ మారిపోయినంత సులభంగా
మనం మారలేము
మనం మారినంత అల్కగా
నిత్య నూతన నవజాత శిశువు
కాలం కనువిప్పు కలిగించదు
కవిగా కాల ప్రవాహంలో
ఈత కొడుతుంటాను
జూకంటి జగన్నాథం
94410 78095
Also Read...
కవిమాట: మిగిలే ఉండును ఒక ప్రశ్న?
- Tags
- poem