- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారం వారం మంచి పద్యం: ఫలితం
అందరం కలిసి యజమాని పోర్షన్ వైపు వెళ్ళాము. ఆయన లేడు. బుంగి ఎదురైండు. నిన్న రాత్రంతా కరెంటు లేదు. ఎందుకు? 'నేను మెయిన్ బంద్ చేసిన' ఫలితంగా మేమంతా గోసపడ్డామో తెలుసా? ఇదంతా మీ మంచి కోసమే చేసిన, అదెట్లా సగం రాత్రి దాకా లైట్లు వేయండని వేయిసార్లు చెప్పిన ఎలక్ట్రికల్ గూడ్స్ వాడితే బిల్ ఎక్కువ వస్తదని చెప్పినా వినలేదు. చాటుమాటుగా వాడటం కరెంటు దొంగతనమే అవుతుంది.
దొంగతనాన్ని అరికట్టడానికి రాత్రి కరెంట్ రద్దు చేసిన! మన పోర్షన్ అన్నింటికి ఒకే మీటర్ ఉండటం ఐక్యతకు గుర్తు. ఎక్కువ కాల్చెటోన్ని పట్టుకొని ఫైన్ వేయాలి కానీ, గంపగుత్తగా కరెంట్ రద్దు చేస్తే అమాయకులం బలికామా? నా నిర్ణయం వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ప్రస్తుతం ఇంటికోసం, దేశం కోసం బాధల్ని భరించక తప్పదు. దేశానికేం సంబంధం కరెంట్ జాతి సంపద అబ్బో వీడు బహురూపులోడు వీడి నాయనే నయం అనుకుంటూ వెనుదిరిగాము.
ఎవరి బాధలు వారివి ఎచట అయిన
విధము ఇంతియె వసుధలో వివరముగను
పేర్లు పలురకములైన ఫలితమొకటె
కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము
డా. బీవీఎన్ స్వామి
92478 17732
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
- Tags
- poem