కవిమాట

by Ravi |   ( Updated:2022-05-22 18:46:01.0  )
కవిమాట
X

'వీటిని తాగినచో అఖండ విద్యావంతుడివి అవుతావు. ఈ వెండి గిన్నె యందు పెరుగు కలదు. దీనిని తాగిన అపర కుబేరుడివగుదువు. ఏది కావాలో కోరుకొనుము. విద్యయా? విత్తమా?'అడిగింది జగదంబ. 'రెండు గిన్నెలూ ' నాకిమ్ము చూసి నిర్ణయించు కొందును'భవాని ఆ గిన్నెలు రెండింటినీ యివ్వగా, చిలిపీ, దుడుకూ అయిన రామకృష్ణుడు రెండింటిలోని పాలు, పెరుగులను చటుక్కున త్రాగివేశాడు. దాంతో మహిషాసురమర్ధినికి ఆగ్రహం కలిగి, వంద శిరస్సులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. ఆ భయంకర రూపాన్ని చూసికూడా రామకృష్ణుడు కొంచెమయినా భయపడలేదు సరికదా పకపకా నవ్వుతూ, 'లోకమాతా! జగజ్జననీ! నా సందేహమును తీర్చుము.

ఒక్కటే ముక్కూ రెండు చేతులూ కలిగిన మాకే రొంపపడితే ముక్కు చీదుకొనుటకు చేతులు నొప్పులు పెట్టునే, నూరు శిరస్సులూ నూరు ముక్కులుకల నీకు పడిసెము పట్టినచో ఎటుల చీదుకొనెదవో, ఎలాగున బాధపడెదవో ఏమిచేసెదవో అని నా మనసున అనుమానము పీడించుచున్నది'అన్నాడు. అతని కొంటె ప్రశ్నకీ చిలిపి సందేహానికీ దేవికి నవ్వొచ్చేసింది. 'అది సరేలే. నేనొక గిన్నెలోనిది తాగమంటే, నీవు రెండు గిన్నెలలోనివీ ఎందుకు తాగితివి?' అని గద్దించింది. రామకృష్ణుడు జగన్మాతకు మోకరిల్లి 'అమ్మా! నీవనిన నాకు భక్తియే అలక్ష్యమేమాత్రమునూ లేదు. కేవలమూ విద్యవలన ధనసంపాదన చేయుట అసాధ్యము. ప్రయోజనము స్వల్పమే. సర్వజ్ఞురాలివగు నీకు తెలియనిదేముండును? మానవజీవితము సక్రమముగానూ సుఖముగానూ ప్రయోజనకరముగానూ సాగవలెనన్న విద్యయూ, విత్తమూ రెండూ అత్యవసరమే కదా?


తెనాలి రామకృష్ణుడు

Advertisement

Next Story

Most Viewed