- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిమాట
టిక్కెట్ ఇచ్చే కిటికీ దగ్గర జనం విరగబడి 'నేను ముందు తెచ్చుకోవాలి అంటే నేను ముందు తెచ్చుకోవాలి' అని త్రొక్కిసలాడుతూ ఉంటారు చూడు, జీవిత సంగ్రామాన్ని తలచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది నాకు. ప్రతివాడు ముందు టికెట్లు తెచ్చుకోవాలని తాపత్రయపడేవాడే గానీ, మిగిలినవాళ్ల సంగతి ఏ ఒక్కడూ ఆలోచించడు. కాళ్లు నలుగుతాయి. చొక్కాలు చిరుగుతాయి. ఇలా చెయ్యటం తప్పు అనుకోడు. చేయించుకోవడం అవమానం అనుకోడు. ప్రతివాడి దృష్టి టిక్కెట్టు మీదే. ఒకడు ఇనప పాదాలతో వస్తాడు. అందరి కంటే వెనక వచ్చినా ముందే టిక్కెట్టు తెచ్చుకుంటాడు. అసమర్థులు ఆ సంఘర్షణలోకి దిగలేక దూరంగా నిలబడి చూస్తూ వుంటారు. వాళ్లకు టిక్కెట్ కావలసిందే, కానీ ప్రయత్నించరు. పైగా టికెట్ కోసం తాపత్రయపడేవాళ్లని చూసి ' నీచులు' 'మోసగాళ్లు' అనుకుని తృప్తిపడతారు.
-త్రిపురనేని గోపీచంద్
(అసమర్థుని జీవయాత్ర నుంచి)
- Tags
- poet word