- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుల చేతిలో యూట్యూబ్ ప్రయోజనం
యూట్యూబ్ సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ సులువుగా చేస్తున్నారు. ఒకప్పుడు పాఠశాల వార్షికోత్సవాల్లో డాన్స్ చేయాలంటే క్లాస్‌కు ఇద్దరు విద్యార్థులు దొరికేవారు. ఇప్పుడు అట్లా కాదు క్లాసు క్లాసంతా అందరు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదంతా ఇంటర్నెట్ యూట్యూబ్ మహిమ. సినిమాలు, పాటలు, డాన్స్‌షోలు ఎన్నో యూట్యూబ్‌లో ఈ రోజుల్లో చూస్తున్నారు. చూడటమే కాదు అనునయిస్తున్నారు. నేర్చుకుంటున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా డాన్స్ అన్నా, సంగీతం అన్నా, జానపద పాటలన్నా ఇష్టపడుతున్నారు. పాతతరంలో బిడియం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చిన్నపిల్లలు సైతం టీవీలో పాట రాగానే దానికి అనుగుణంగా కాళ్ళు చేతులు నడుము ఆడిస్తున్నారు. కళ విస్తరించి నృత్యం, గానం ఇంటర్నెట్ పుణ్యమా అని పల్లె పల్లెకు వచ్చాయి. ఎవరిని చూసినా సెల్‌ఫోన్ పట్టుకొనే కన్పిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో సోషల్ మీడియాకు అట్రాక్ట్ అయి అందులోని మసాలాలో కూరుకుపోతున్నారు. యూట్యూబ్‌లో సినిమా పాటలు నేర్చుకోవడమే కాకుండా ఈ తరం యువతీ యువకులు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. అందులో రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో షార్ట్ చేస్తున్నారు. టెక్నాలజీ ఇలా వేళ్ళ మీద తీసికొని ఉపయోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో 3,4 ఏండ్ల పిల్లలకు కూడా రైమ్స్ నేర్పిస్తున్నారు. వాళ్లకు వాళ్లే ఫోన్ తీసుకొని ప్యాట్రన్ లాక్ తీసి యూట్యూబ్ చూస్తున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ అరచేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది.
యూట్యూబ్ వంటలు
డాన్స్, పాటలు, సంగీతమే కాదు యూట్యూబ్ వంటలకూ ప్రసిద్ధమైంది. చికెన్, బిర్యానీ స్వీట్లు ఎన్నో రకాల వంటలు ఎంత మధురంగా చేయవచ్చో యూట్యూబ్ ఛానల్ ద్వారా చెబుతున్నారు. ప్రాక్టికల్‌గా వంట వండి చూపించే చానల్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్ని రకాల వంటలైనా సులువుగా రుచికరంగా చేయడం అన్నీ యూట్యూబ్‌లో పూసగుచ్చినట్టు నోట్లో నీళ్ళు ఊరినట్టు చెబుతున్నారు. గతంలోనైతే తల్లి నుంచి పిల్లలకు వంట ఎట్లా చేయడమో వచ్చేది. పెండ్లి అయిన తర్వాతనైతే అత్తగారి ద్వారా నేర్చుకునేది. మామూలు అన్నం కూరలు గాకుండా ప్రత్యేకమైన వంటలు వెజ్ నాన్‌వెజ్ ఎన్నిరకాలో ఎన్ని రుచులో అన్ని నేర్పించే చానల్స్ ఏర్పాటు చేసినా వారికే వ్యూయర్స్ వచ్చి డబ్బులు వస్తున్నాయి. అలా వాళ్ళకూ లాభం. చూసేవాళ్లకు ఉచితంగానే వంటల తయారీ దొరుకుతుంది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏది అంటే అది దొరుకుతున్నది. బడి పిల్లలకు బొమ్మలు తయారు చేసే క్రాఫ్ట్ పనులు, వస్తువులు తయారు చేయడం నుంచి బొమ్మలు దించడం, రంగులు వేయడం వరకు అన్నింటికీ ఈ రోజు ఇంటర్నెట్‌లో యూట్యూబే గురువు అయ్యింది. అత్యంత ఆధునిక సాంకేతిక జ్ఞానం ఈ రోజుల్లో పల్లెటూర్లకు విస్తరించడం, కొద్దో గొప్పో చదువుకున్న వాళ్లు కూడా దానిని వాడటం గొప్ప విషయమే కాదు మహా అవకాశం. టెక్నాలజీ అందరి పొత్తు. అందరూ వాడాలి. దానితో మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసి సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించాల్సిన అవసరముంది.
అన్నవరం దేవేందర్
9440763479
- Tags
- antarangam