- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవెల లేని దైవం
by Ravi |
X
అక్షరాలకు అందనిది అమ్మ
అంతుని ప్రేమ నిధి అమ్మ
మానవ జన్మకు అర్థం అమ్మ.
మనిషి ఉనికికి పరమార్థం అమ్మ
బతుకు నావకు చుక్కానియై
జీవిత గమనానికి మార్గదర్శియై
వేదనలో వెలుగునిచ్చే జాబిల్లి
కరుణ పంచడంలో కల్పవల్లి
అనురాగంలో అమృతవల్లి
బిడ్డల ఆకలి తీర్చేది అమ్మ
తను తినక బిడ్డల కోసం దాచేది అమ్మ
సృష్టిని సృష్టించినదొక బ్రహ్మ
బ్రహ్మనే సృష్టించింది అమ్మ
అనురాగాన్ని పంచేది అమ్మ
ఆత్మాభిమానం కలది అమ్మ
ఈర్ష్యా ద్వేషం లేనిది అమ్మ
నేనున్నానని ఊరట నింపేది అమ్మ
మమతకు మారుపేరు అమ్మ
ఎన్ని కోట్లు పెట్టిన కొనలేనిది అమ్మ
గుడి లేని దైవం అమ్మ
మాతృప్రేమ అనుభూతి
ఎక్కడ కనిపించదు అంత గొప్ప బంధం.
పెద్దపల్లి భారతీచారి
గోదావరిఖని, ఎన్‌టీపీసీ
94948 00788
Advertisement
- Tags
- poet word
Next Story