- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తు ధరలు పెంచనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31తో మద్యం దుకాణాల గడువు ముగియనుంది. నవంబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. అక్టోబర్లోనే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. దీనికోసం వచ్చేనెల నూతన మద్యం పాలసీని ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈసారి పాత పాలసీని దాదాపుగా అమలు చేస్తూ కొత్తగా అప్లికేషన్ ఫీజును పెంచేందుకు సాధ్యాసాధ్యాలను బేరీజు వేస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రమే మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజును 5 శాతం మేరకు పెంచే అంశాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పుడిదే ఆదాయం
ప్రస్తుతం రాష్ట్ర సర్కారు మద్యం వ్యాపారాలపైనే కన్నేసింది. లిక్కర్ అమ్మకాల ద్వారా వీలైనంత ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పులతో డీలాపడ్డ రాష్ట్ర ఖజానాకు కిక్కెక్కించేందుకు అదొక్కటే మార్గమని భావిస్తోంది. ప్రభుత్వానికి జీఎస్టీ తర్వాత మద్యం అమ్మకాల ద్వారానే అత్యధిక రాబడి సమకూరుతోంది. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ. 24 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఈ రాబడిని వీలైనంత మేరకు పెంచే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. రెండేండ్లకొకసారి ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుండగా.. కొన్ని కారణాల నేపథ్యంలో అక్టోబర్ వరకు అవకాశం కల్పించారు. అయితే కొత్త పాలసీ ఎలా ఉండాలనే దానిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
పెంచేందుకు ప్రయత్నం
రాష్ట్రంలో వచ్చే రెండేండ్లకు మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజులు పెంచాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ లైసెన్స్ ఫీజు పెంచితే మద్యం ధరలను పెంచాల్సి వస్తుందని, ఇది అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మద్యం ధరలు పెంచకుండా కేవలం లైసెన్స్ ఫీజులు పెంచితే వ్యాపారులు ముందుకు వస్తారా? అనేది కూడా సందేహమే. దీనితో పాటుగా కొత్త మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం, దరఖాస్తు ధరను పెంచటం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలున్నాయి. అదే కోణంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మద్యం పాలసీ గడువు 15 రోజుల్లో ముగిసేటప్పుడు కొత్త పాలసీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. వచ్చే నెలలో పాలసీని ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా 200కుపైగా మద్యం దుకాణాలు
స్వరాష్ట్రంలో కొత్త మద్యం షాపులకు అనుమతి ఇవ్వలేదు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో 82 బార్లకు పర్మిషన్ ఇచ్చినా.. వాటిని ఇంకా తెరువడం లేదు. బార్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 వైన్ షాపులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు.. ప్రధానంగా జాతరలు, ఏడాదిలో ఎక్కువ కాలం పండుగలు, జాతరలు నిర్వహించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీల పరిధి కూడా పెరిగింది. దీంతో కొత్త షాపులకు ఈసారి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త మండలాలు కూడా ఏర్పాటయ్యాయి. కొత్త మండలానికి ఒక్కో వైన్ షాపు అనుమతి ఇవ్వనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి పెరగడంతో అక్కడ కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా 200కుపైగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
దరఖాస్తు ఫీజు రూ. 3 లక్షలు..?
మద్యం దుకాణాకి టెండర్ వేసేందుకు దాఖలు చేసే దరఖాస్తు ధర పెంచాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2015–17లో దరఖాస్తుకు రూ. 50 వేల ఫీజు ఉండగా.. గత పాలసీ సమయంలో ప్రభుత్వం ఈ ఫీజును డబుల్ చేసింది. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున వసూలు చేసింది. దీంతో అనూహ్యంగా దరఖాస్తుల ద్వారానే సర్కార్కు రూ. 600 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఏకంగా రూ. 3 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు. దీంతో దరఖాస్తుల ద్వారానే రూ. 1200 కోట్లకుపైగా వస్తుందని అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటే కొన్ని దరఖాస్తులు తక్కువయ్యే అవకాశం ఉందని, అయినా కూడా రూ. 1200 కోట్లు ఖజానాకు వస్తాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు లైసెన్స్ ఫీజులపై మాత్రం కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు అధికారులు పలువిధాలుగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు శ్లాబుల విధానం అమల్లో ఉంది. మొదటి శ్లాబుకు రూ. 45 లక్షలు, రెండో శ్లాబుకు రూ. 50 లక్షలు, మూడో శ్లాబుకు రూ. 85 లక్షలు, నాలుగో శ్లాబుకు రూ. కోటీ 20 లక్షలు ఉంది. అన్ని శ్లాబుల ధరలను పెంచకుండా.. కొన్ని చోట్ల పెంచాలని సూచిస్తున్నారు. కానీ పెంచితే అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలను అంచనా వేస్తున్నారు. పెంచే అవకాశం ఉన్న చోట మాత్రం కేవలం 5 నుంచి 8 శాతంలోగా పెంచాలని భావిస్తున్నారు. కానీ దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.