- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 నుంచి మద్యం దుకాణాలు బంద్
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకూ మద్యం దుకాణాలకు డ్రై డే ప్రకటించినట్టు సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వీసీ సజ్జనార్ తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 14వ తేదీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా, ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడానికి 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 14వ తేదీ వరకూ మద్యం దుకాణాలు బంద్ చేయాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కల్లు దుకాణాలు, వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్ బార్స్, క్లబ్బులు బంద్ కానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే బుధవారం (17వ తేదీ) కూడా ఈ ఆదేశాలు అమలు అవుతాయి. అంతే కాకుండా, ఒకవేళ ఎక్కడైన రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే.. ఆ సమయంలో మద్యం దుకాణాలు బంద్ అయ్యే అవకాశం ఉన్నట్టు సజ్జనార్ తెలిపారు.