ఐదు ప్రైవేటు వర్సిటీలకు లైన్ క్లియర్?

by Shyam |
ఐదు ప్రైవేటు వర్సిటీలకు లైన్ క్లియర్?
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాదే ప్రత్యేక చట్టం చేసింది. ఆ తర్వాత ప్రైవేటు వర్సిటీలను రాష్ట్రంలోకి తేవడానికి కసరత్తూ ప్రారంభించింది. తాజాగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఇందులో మూడు మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండగా ఒకటి మెదక్ జిల్లా, మరొకటి వరంగల్ జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఇందులో రాష్ట్ర కార్మిక మంత్రిగా ఉన్న మల్లారెడ్డికి సంబంధించిన ఒక వర్సిటీ, రైతుబంధు సమితి ఛైర్మన్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంబంధించిన వర్సిటీ ఉన్నాయి. ఈ రెండూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే వస్తున్నాయి. ఇదే జిల్లాలో బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ కూడా రాబోతుంది. వరంగల్ జిల్లా అనంతసాగర్‌లో ఎస్సార్ యూనివర్సిటీ, మెదక్ జిల్లా కంకోల్‌లో వోక్సన్ వర్సిటీ వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కావడంతో ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకొచ్చింది. అన్ని ప్రైవేటు వర్సిటీలకూ ఒకే చట్టం ఉండే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed