యూట్యూబర్స్‌కు షాక్.. హెల్త్ వీడియోలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ సంచలన నిర్ణయం

by Anjali |   ( Updated:2023-08-18 11:41:28.0  )
యూట్యూబర్స్‌కు షాక్.. హెల్త్ వీడియోలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: జనాలు ఎక్కువ మంది వీక్షించే యూట్యూట్ తాజాగా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్టూహెచ్‌ఓ) వెల్లడించిన విషయాలకు విరుద్ధంగా.. వైద్యం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చే వీడియోలన్నింటినీ తొలగించబోతున్నట్లు బ్లాగ్ పోస్ట్ ద్వారా యూట్యూబ్ తెలియజేసింది. పరిశోధనలతో సంబంధం లేకుండా ఫలానా చిట్కాలు ఫాలో అయితే ఎన్నో సమస్యలు నయమవుతాయనీ, ఇలాంటి, అలాంటి ఆహారం తీసుకున్నట్లయితే చికిత్స కూడా అవసరం లేదని చాలా వీడియోలల్లో చెబుతుంటారు.

ఎంతోమంది వీటిని గుడ్డిగా ఫాలో కూడా అవుతుంటారు. అయితే హెల్త్ టిప్స్‌కు సంబంధించిన ఛానెల్స్‌లో వెల్లుల్లి వాడితే చాలు క్యాన్సర్‌ను తరిమికొట్టొచ్చు. లేదంటే.. వెల్లుల్లి క్యాన్సర్‌ను నయం చేస్తుందనో చెప్పడం.. రోజూ ఈ ఆహారం కొంచెం తీసుకుంటే చాలు ఏ వైరస్ మీ దరిచేరదు, లంగ్స్ పాడైపోతే డాక్టర్లు అవసరం లేదు.. ఇంట్లో ఇలా చేస్తే చాలు.. ఇటువంటి విషయాలకు సంబంధించిన కొన్ని వీడియోలు తొలగిస్తామని యూట్యూబ్ ఆగస్టు 15వ తేదీన కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. అలాంటి వీడియోలను తొలగించే ప్రక్రియను ఇవాళ్టి నుండి స్టార్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. వ్యక్తిగత సాక్ష్యాలు, నిర్ధిష్టమైన వైద్య అధ్యయనం ద్వారా సృష్టించిన కంటెంట్‌కు అలాంటి వీడియోలకు, ఆరోగ్య స్పృహ కోణంలో చర్చావేదికగా నిలిచే వీడియోలకు మినహాయింపు ఉంటుందని యూట్యూబ్ వెల్లడించింది.

Advertisement

Next Story