సబ్బు సువాసనకు అట్రాక్ట్ అవుతున్న దోమలు.. మీ సోప్ నచ్చితే ఖేల్ ఖతమ్..

by Anjali |   ( Updated:2023-05-11 14:09:49.0  )
సబ్బు సువాసనకు అట్రాక్ట్ అవుతున్న దోమలు.. మీ సోప్ నచ్చితే ఖేల్ ఖతమ్..
X

దిశ, ఫీచర్స్: బ్లడ్ గ్రూప్, బాడీ స్మెల్‌ ఆధారంగా దోమలు మనుషుల వైపు ఆకర్షించబడతాయని గత అధ్యయనాలు తెలిపాయి. కానీ మనం యూజ్ చేసే సబ్బు కూడా ఇందుకు కారణమవుతుందని తెలిపింది తాజా అధ్యయనం. మనకు ఇష్టమైన బ్రాండెడ్ సోప్‌పై మస్కిటోస్‌ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే... ఇక దోమలు మీ వెంటే అంటున్నారు పరిశోధకులు. గత అధ్యయనంలో నిర్దిష్ట సువాసనల వైపుకు దోమలు అట్రాక్ట్ అవడం లేదా అటు వైపు రాకుండా ఉండటం జరుగుతుందని తెలపగా.. డవ్, సింపుల్ ట్రూత్ వంటి సోప్స్ అట్రాక్టివ్‌గా, మిగిలినవి ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని వివరించింది. అయితే తాజాగా సోప్‌లో ఉపయోగించే ఎలాంటి సమ్మేళనాలు ఆకర్షణ, వికర్షణ కారకాలుగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు.

ప్రయోగం సమయంలో మనుషుల రక్తాన్ని పీల్చే ఆడ ఈడెస్ ఈజిప్టి దోమలను ఉపయోగించిన సైంటిస్టులు.. ప్రయోగంలో పాల్గొనేవారి సోప్ స్మెల్‌తో కూడిన క్లాత్, మనుషులు ఎక్కడున్నారో గుర్తించే కార్బన్ డై యాక్సైడ్ ఉఛ్వాస ప్రభావాలను పరిగణలోకి తీసుకున్నారు. తెలిసిన దోమల వికర్షకం అయిన లిమోనీన్‌ని కలిగి ఉన్న నాలుగు పరీక్షించిన సబ్బులు ఉన్నప్పటికీ.. ఈ నాలుగింటిలో మూడు దోమల ఆకర్షణను పెంచాయి.

ఈ క్రమంలో కొబ్బరి సువాసన.. గజ్జి, పేను చికిత్సకు ఉపయోగించే పూల సమ్మేళనంతో సహా దోమల ఆకర్షణకు సంబంధించిన నాలుగు రసాయనాలను, వికర్షణకు సంబంధించిన మూడు రసాయనాలను గుర్తించారు. ఈ సమ్మేళనాలు ఆకర్షణీయమైన, వికర్షక వాసన మిశ్రమాలను సృష్టించడానికి, పరీక్షించడానికి మిళితం చేయబడ్డాయి. మొత్తానికి దోమల ఆకర్షణను తగ్గించుకోవాలనుకుంటే కొబ్బరి సువాసన గల సబ్బును ఎంచుకోవడం మంచిదని కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి:

శిక్ష : హామీలు నెరవేర్చని నాయకుడిని నదిలో ముంచేసిన జనం

Advertisement

Next Story