దోమలు పగబట్టినట్టుగా కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Dishafeatures1 |
దోమలు పగబట్టినట్టుగా కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్: ఎవరైనా సరే ఎక్కువగా భయపడేది అంటువ్యాధులకే. ముఖ్యంగా దోమలతో వ్యాపించే అంటు వ్యాధి మలేరియా అంటే చాలా మందికి భయం ఉంటుంది. మలేరియా దోమల వలన వచ్చే ఓ అంటువ్యాధి. దీని వలన చాలా మంది మరణిస్తున్నారు. ఇక మలేరియా బారిన పడిన వారిని కుట్టిన దోమ మనల్ని కుడితే ఆ జ్వరం వచ్చేస్తుంది. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల్లో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ఉంటుంది. దానివల్లే మనకు మలేరియా వస్తుంది.

అయితే దోమలు ఎవరిని ఎక్కువగా కుడతాయి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారి కోసమే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్. దోమలు మనుషుల్ని కళ్లతో పాటు వాటి తలపై ఉండే యాంటీనా తో గుర్తిస్తాయి. మనిషి శరీరపు వేడి, మనిషి శ్వాసలోని కార్బన్ డై ఆక్సైడ్, తేమ, శరీరపు వాసన వంటి సంకేతాల ఆధారంగా కొందరిని దోమలు ఎక్కువగా కుడుతుంటాయి

*ఉష్ణోగ్రతల మధ్య 1 డిగ్రీ సెల్సియస్ తేడా వరకు అవి ఈజీగా గుర్తిస్తాయి. కాబట్టి ఒంటిపై వేడి ఎక్కువగా ఉన్నవారికి అవి ఈజీగా టార్గెట్ చేస్తాయి.

*దోమలు ముదురు రంగు దుస్తులు వేసుకున్న వారిని, ఫుల్ స్లీవ్స్ కంటే హాఫ్ స్లీవ్స్ షర్టులు ధరించిన వారినే ఎక్కువగా కుడతాయి.

*ఓ బ్లడ్ గ్రూప్ (‘O’ blood group) ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఈ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించిన చర్మంలో ఉండే ప్రత్యేకమైన రసాయనాల కారణంగా ఇలా జరుగుతుందట.

* అలాగే దోమలు ఎక్కువగా చెమటను ఇష్టపడుతాయంట. చెమట వాసన అంటే వాటికి చాలా ఇష్టం. అందువలన ఏ వ్యక్తికి అయితే చెమటలు ఎక్కువ పడుతాయో వారిని దోమలు ఎక్కువగా కుడుతాయి.

*భూమిపై ఉన్న జీవుల్లో మనుషులకు ఎక్కువగా వ్యాధులు సోకేలా చేసే జీవులు దోమలే. వీటివల్ల మలేరియా మాత్రమే కాదు డెంగ్యూ, జికా వైరస్, టైఫాయిడ్ వంటి అనేక జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేసవిలో, వానాకాలంలో మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రజలందరూ ఈ సీజన్‌లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను నీట్ గా ఉంచుకోవాలి.

Next Story

Most Viewed