- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలికాలం ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే అనారోగ్యాల బారిన పడినట్టే..!
దిశ, వెబ్‌డెస్క్: వాతావరణంటలో రోజు రోజుకు మార్పులు సంభవిస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. తక్కువ ఉష్ణోగ్రతలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గించి.. వైరస్‌లు విజృంభించేలా చేస్తాయి. ఈ సమయంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లోనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చలికాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రిజ్‌లో ఉండే పదార్థాలు : చలికాలంలో చల్లటి వస్తువులు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ప్రిజ్ నుంచి తీసిన ఆహారాన్ని నేరుగా సేవించకూడదు. ఒక అరగంట, గంట పాటు బయట ఉండనిచ్చి తర్వాత దాన్ని ఉపయోగించాలి.
చల్లని పదార్థాలు: చాలా మందికి కేక్‌లు, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, జూస్‌లు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కానీ, శీతాకాలంలో వీటిని కుదిరినంత పరిమితం చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. చలికాలంలో పండ్ల రసాలు, చక్కెర పానీయాలు, శీతల పానీయాలు అధికంగా ఉపయోగిస్తే అవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేయడంతో.. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని ద్వారా తొందరగా రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.
వేపుడులు: సాధారణంగా ఏ సీజన్ అయినా ఆయిల్ ఫుడ్స్ శరీరానికి అంత మంచిది కాదు. చాలా మందికి కూరలు ఇష్టం లేక వేపుడులు చేసుకుంటారు. వేపుడుకి పరిమితికి మించి ఆయిల్ ఉపయోగిస్తారు. అయితే వేపుడులు, ఆయిల్ ఫుడ్స్ వంటి ఆహారాల్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. బరువు పెరగడంతోపాటు, శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే పాల ఉత్పత్తులు శ్లేష్మం ఉత్పత్తి చేస్తాయి. వీటి వల్ల ఆస్తమా, ఇతర ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. చలికాలంలో పాలు, షేక్స్, స్మూతీస్ వంటి చల్లని పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పచ్చి ఆహారం: చాలా మందికి సలాడ్, పచ్చి ఆహారం తినే అలవాటు ఉంటుంది. అయితే శీతాకాలంలో వాటికి దూరంగా ఉండటమే మంచిదట. ఎందుకంటే శీతాకాలంలో సలాడ్, పచ్చి ఆహారం వంటి చల్లటి ఆహారాలు ఎసిడిటీని, ఉబ్బరాన్ని పెంచుతాయి. కాబట్టి కాలానికి అనుగుణంగా ఆహారాలు తీసుకోవడం మంచిది.
మాంసాహారాలు: మాంసాహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శారీరక శ్రమ చేయని వారు వాటిని తినకుండా ఉండటం బెటర్ అంటున్నారు నిపుణులు. ఒక వేళ తింటే జీర్ణ సమస్యలతో పాటు.. బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. అయితే.. శీతాకాలంలో ఈ ఆహారం మరింత ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి.. ఇలాంటి ఆహారాలు శరీరానికి అలర్జీ కలిగించే అవకాశం ఉంటాయట.
నోట్: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చినవి మాత్రమే. శీతాకాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతైనా మంచిది.
- Tags
- health tips