ప్రతి రోజూ టీ తాగుతున్నారా? అయితే టీ లవర్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?

by Anjali |   ( Updated:2024-01-11 12:11:32.0  )
ప్రతి రోజూ టీ తాగుతున్నారా? అయితే టీ లవర్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?
X

దిశ, ఫీచర్స్: టీ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టీ తాగనిది వారికి రోజూ మొత్తం గడవదు. ఎంత పుష్టిగా ఆహారం తిన్నా.. టీ తాగకపోతే మాత్రం రోజంతా ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అంతలా టీ ను ఇష్టపడే వారున్నారు మరీ. పైగా ఆఫీస్ లో వర్క్ చేసే వారికైతే టీ తప్పనిసరి. వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందాలంటే వారు కనీసం 3 సార్లైనా టీ తాగాల్సిందే.

కాగా తెల్లవారితే చాలు కడుపులో ఛాయ పడనిది పనులు స్టార్ట్ చేయనివారు.. మరీ మీరు రోజూ తాగే టీలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు తాగే టీ రకాన్ని బట్టి అందులో ఉండే పోషకాలు చేంజ్ అవుతూ ఉంటాయి. టీ పొడిని తేయాకు తో రెడీ చేస్తారు. ఇందులో పుష్కలంగా కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ మైండ్ చురుగ్గా పనిచేయడానికి మేలు చేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది మార్నింగ్ లేవగానే ఛాయ తాగుతారు. కెఫిన్ వల్ల నిద్రమత్తు వదులుతుంది. అప్రమత్తంగా ఉంటాం. అయితే కొంతమంది ఛాయలో అల్లం దాల్చిన చెక్కలు, యాలకులు, లవంగాలు వంటివి వేసుకొని తాగుతుంటారు. వాటి వల్ల ఏం ఉపయోగమో ఇప్పుడు చూద్దాం..

పాలు..

టీ చేయడానికి ముఖ్యంగా పాలు అవసరం. పాలు శరీరానికి ఎంత బలమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలకు బలాన్ని చేకూర్చుతాయి. పాలలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇలా చాలామంది టీ కంటే పాలే ఎక్కువగా తీసుకుంటారు.

చక్కెర..

దాదాపు టీ లో చక్కెర వేసుకునే తాగేవారు ఉంటారు. షుగర్ పేషెంట్స్ మాత్రమే చక్కెర లేకుండా తాగుతారు. టేస్ట్ కోసం మాత్రమే షుగర్ వేసుకుని తాగుతారు. కానీ చక్కెర వేసుకుని టీ తాగడం వల్ల శరీరానికి అందే పోషకాలు జీరో. కాబట్టి షుగర్ తక్కువగా వాడటమే మేలు.

యాలకులు..

చాలామంది టీ లో యాలకులు వేసి చేస్తారు. ఛాయలో యాలకులు వేయడం వల్ల సిట్రస్ రుచిని ఇస్తుంది. అలాగే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారికి యాలకులు బెస్ట్ మెడిసిన్ అని చెబుతుంటారు. అలాగే యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాగా యాలకులు వేసుకుని టీ తాగే వారు ఏం సందేహించాల్సిన అవసరం లేదు.

దాల్చిన చెక్క..

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దాల్చిన చెక్కను టీ లో వేసుకుని తాగితే శరీరానికి కావాల్సిన కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. రుచిని, వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి టీ లో దాల్చిన చెక్క వేసుకుని తాగితే శరీరానికి మంచిదేనంటున్నారు నిపుణులు.

అల్లం..

టేస్ట్ కోసం చాలా మంది టీ లో అల్లం వేసుకుని తాగుతారు. కానీ ప్రతి రోజూ ఛాయలో అల్లం ఉపయోగించకూడదు. వారంలో రెండు సార్లు మాత్రమే అల్లం వేసుకోవాలి. ముఖ్యంగా వాంతులు, వికారం ఉన్నప్పుడు అల్లం టీ తాగితే బిగ్ రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచితో పాటు జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గొంతు నొప్పి, గొంతు మంట ఉన్నప్పుడు అల్లం టీ తాగడం మంచిది.

లవంగాలు..

యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండే లవంగాలు శరీరానికి ఎంతో మంచివి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. కేవలం కర్రీలో వేయడమే కాకుండా మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో నోట్లో వేసుకుని చప్పరిస్తే మాట మందంగా వచ్చే వారి గొంతు సన్నగా వస్తుంది. శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని అందించే లవంగాలు టీ లో తక్కువగా వాడుతారు. కానీ ఎక్కువ మేలు చేస్తుంది. కాగా లవంగాలను ప్రతి రోజు టీ లో వేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

అయితే ఇన్ని ఉపయోగాలున్నాయని రోజులో 5, 6 సార్లు టీ తాగితే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాగా టీ రోజుకు రెండు, మూడు సార్లు మాత్రమే తాగాలి. బాడీలోకి కెఫిన్ ఎక్కువగా చెరితే శరీరం వీక్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి టీ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే ప్రతి రోజూ టీ తాగేవారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.

Advertisement

Next Story