వేసవిలో దొరికే ఈ పండుతో బరువు సులభంగా తగ్గవచ్చు..!

by Prasanna |   ( Updated:2024-05-11 15:14:19.0  )
వేసవిలో దొరికే ఈ పండుతో బరువు సులభంగా తగ్గవచ్చు..!
X

దిశ, ఫీచర్స్: వేసవిలో లభించే చాలా పండ్లు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో ఆప్రికాట్ ఒకటి. ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు బరువు తగ్గించే ఔషధంగా పనిచేసి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ఆప్రికాట్ పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బరువు తగ్గడం

మీరు బరువు తగ్గాలని అనుకున్నట్లయితే, మీ ఆహారంలో ఈ పండును తప్పకుండా చేర్చుకోండి. ఆప్రికాట్ పండు తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది.

కంటి ఆరోగ్యం

ఆప్రికాట్ పండు కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతుంటారు. దీనిలో ఉండే విటమిన్ ఎ యాంటీ ఆక్సిడెంట్లు దృష్టిని మెరుగుపరచడమే కాకుండా కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బలమైన రోగనిరోధక శక్తి

ఆప్రికాట్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీరు తరచుగా జలుబు ,దగ్గుతో బాధపడుతుంటే, మీ ఆహారంలో ఆప్రికాట్ పండ్లను తప్పకుండా చేర్చుకోండి.

మలబద్ధకం నుంచి ఉపశమనం

ఆప్రికాట్లో ఉండే పీచు పదార్థం జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్ సమస్యల దూరం చేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Read More...

ఆరోగ్యానికి మేలు చేసే ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్.. ఎందులో ఏయే పోషకాలు ఉంటాయంటే..

Advertisement

Next Story

Most Viewed