Yoga - Anjaneyasana: ఆంజనేయ ఆసనం ఎలా చేయాలి? ఉపయోగాలేంటి?

by samatah |   ( Updated:2022-05-12 06:09:22.0  )
Yoga - Anjaneyasana: ఆంజనేయ ఆసనం ఎలా చేయాలి? ఉపయోగాలేంటి?
X

Yoga - Anjaneyasana

దిశ, ఫీచర్స్ : మొదట బల్లపరుపు నేలపై మోకాళ్లు, అరచేతులు ఆన్చి జంతు భంగిమలో వంగాలి. తర్వాత పైకి లేస్తూ కాలి వేళ్లు, అరచేతులపై శరీర బరువును మోపాలి. ఇప్పుడు కుడి కాలును పైకి లేపాలి. తర్వాత అదే కాలును కుడి భుజం దగ్గరకు తీసుకొచ్చి కుడి కాలిపై కూర్చోవాలి. ఈ సమయంలో ఎడమకాలు వెనకకు నిటారుగా ఉండాలి. తర్వాత చేతులను పైకి లేపి రెండు చేతివేళ్లను కలిపి రెండు చూపుడు వేళ్లతో ఆకాశాన్ని చూపిస్తూ శరీరాన్ని పైకి లాగాలి. ఇలా కాసేపు ఆగి మళ్లీ చేతులు నేలపై పెట్టి కుడి కాలు వెనకకు, ఎడమకాలు ముందుకు తీసుకువస్తూ ఇదే విధంగా చేయాలి. మొత్తంగా ఇలా రెండు కాళ్లతో ఓ ఐదు సార్లు చేస్తే ఉత్తమ ఫలితాలుంటాయి.

ఉపయోగాలు:

* వెన్నెముక కదలిక మెరుగుపడుతుంది.

* ఆరోగ్యకరమైన జీర్ణక్రియ సొంతమవుతుంది.

* బరువు త్వరగా తగ్గుతారు

* బాడీ ఫిట్‌గా మారుతుంది

Advertisement

Next Story

Most Viewed