Ostriches eating stones: వామ్మో.. ఈ పక్షులు రాళ్లను సైతం ఆరగించేస్తాయి!

by D.Reddy |   ( Updated:2025-03-20 15:04:24.0  )
Ostriches eating stones: వామ్మో.. ఈ పక్షులు రాళ్లను సైతం ఆరగించేస్తాయి!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పక్షులు (Birds) ఆహారంగా.. గింజలు, చిన్న చిన్న పురుగులను తింటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ, ఓ పక్షి మాత్రం ఏకంగా రాళ్లను తింటుంది. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనండి. ఆస్ట్రిచ్ (Ostriches).. దీనిని నిప్పు కోడి అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద పక్షిగా పేరొందిన ఆస్ట్రిచ్‌కు ఆహారం (Food) విషయంలో విభిన్నమైన పద్దతి ఉంది. ఇవి నేలపై ఉండే రాళ్లను సైతం పప్పుల్లా ఎంచెక్క ఆరగించేస్తుంటాయి. ఇంతకీ ఈ నిప్పు కోళ్లు రాళ్లను ఎందుకు తింటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆస్ట్రిచ్‌ అత్యంత ఎత్తైన, బరువైన పక్షి. వీటిలో మగ ఆస్ట్రిచ్ పొడవు 9 అడుగుల వరకు, ఆడ ఆస్ట్రిచ్ 6 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు 100 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. ఇక ఇవి ఆహారంగా మొక్కలు, కీటకాలు, చిన్న జీవులతో పాటు రాళ్లను కూడా తింటాయి. ఎందుకంటే.. వీటికి దంతాలు ఉండవు. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా రాళ్లను ఉపయోగిస్తాయి. ఆస్ట్రిచ్ జీర్ణాశ్రయంలోకి వెళ్లిన ఈ రాళ్లు ఆహారాన్ని చిన్న చిన్న పదార్థాలుగా విడగొడతాయి. తద్వారా జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తాయి. అంతేకాదు, ఎక్కువగా పోషకాలు అందేలా చేస్తాయి. కడుపులోని pH విలువను సమతుల్యం చేస్తాయి. అలాగే, రాళ్లల్లో ఉండే క్యాల్షియం ఆస్ట్రిచ్ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఆస్ట్రిచ్‌కు కావాల్సిన ఫైబర్ కూడా ఈ రాళ్ల నుంచి లభిస్తుంది.

ఇక ఇవి ఎక్కువగా దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా ఇతర ప్రాంతాలలో జీవిస్తుంటాయి. ఆస్ట్రిచ్ గాలిలో ఎగరలేనప్పటికీ 3 నుంచి 5 మీటర్ల దూరం జంప్ చేయగలదు. ఎంతో వేగంగా నడుస్తుంది. సగటున గంటలో 75 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. అలాగే, ఇవి నెలలో 10 నుంచి 12 గుడ్లు పెడతాయి. వీటి గుడ్డు కూడా దీని గుడ్డు 6 అంగుళాల పొడవు, 5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇక ఈ పక్షులు గుంపులు గుంపులుగా జీవించేందుకు ఇష్టపడతాయి. 5-100 పక్షులు ఒక దగ్గరే పెరగడానికి ఆసక్తి చూపిస్తాయి. అలాగే, చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఆత్మరక్షణ విషయానికి వస్తే.. ఒక్క దెబ్బలో మనిషిని చంపగలవు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రిచ్.. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉంది.

READ MORE ...

Armadillo: ఈ జంతువును తుపాకీతో కాల్చినా దానికి ఏమీ కాదు..'బుల్లెట్ ప్రూఫ్' ఎనిమల్‌ గురించి తెలుసుకోండి!




Next Story

Most Viewed