బయో మెటీరియల్ టాయిలెట్.. నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు..

by S Gopi |   ( Updated:2023-04-04 10:25:09.0  )
బయో మెటీరియల్ టాయిలెట్.. నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు..
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోని మొట్టమొదటి బయో-మెటీరియల్ టాయిలెట్ ఆవిషృతమైంది. యూరోపియన్‌కు చెందిన ‘ఉడియో హోమ్స్’ మిశ్రమ కలపతో తయారుచేసిన ఆధునిక ఫ్లషబుల్ టాయిలెట్‌‌ను తయారు చేయగా దీన్ని మనకు అనుకూలంగా మార్చుకునేలా తీర్చిదిద్దడం విశేషం.

కొంతమంది వ్యక్తులు తమ టాయిలెట్‌లో ప్రశాంతతను కోరుకుంటారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు అక్కడే రిలీఫ్ అవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు చల్లగా ఉండాలనుకుంటే.. మరికొందరు ఏసీ గదులనుంచి ఉపశమనం కోసం వెచ్చదనం కావాలనుకుంటారు. దానికోసం విభిన్న పద్ధతుల్లో తమ ఇంట్లో, ఆఫీసుల్లో టాయిలెట్‌ను ఏర్పాటు చేయించుకుంటున్నట్లు గ్రహించిన ఉడియో హోమ్స్ ఈ ప్రయోగానికి నాంది పలికింది.

గోడపై వేలాడదీసిన ఆకర్షణీయమైన ఈ టాయిలెట్ సీటు ఎత్తును మనకు అనకూలమైన హైట్‌కు సరిపోయేలా సర్దుబాటు చేయవచ్చు. కాగా పూర్తిగా కలప, రెసిన్ మిశ్రమంతోపాటు కాస్త పింగాణీ కూడా జత చేసిన టాయిలెట్.. చాలా బలంగా ఉండటంతోపాటు ధూళిని ఆకర్షించదు. అలాగే టాయిలెట్ బౌల్ లోపల అటోమెటిక్ టాయిలెట్ క్లీనర్స్ శుభ్రం చేసే సౌలభ్యం ఉండగా.. బయట భాగాన్ని ఎలాంటి కెమికల్ అవసరం లేకుండా కేవలం గుడ్డతో లేదా టిష్యూ పేపర్‌తో తుడిస్తే సరిపోతుంది.

‘ప్రపంచాన్ని విభిన్నంగా చూడాలనుకునే వ్యక్తుల సమూహం కోసం ఏదైనా కొత్తగా చేయాలని మాకు ఈ ఆలోచన మొదలైంది. చెక్క పలకలతోనే అద్భుతమైన బాత్రూమ్ తయారు చేయాలనేది మా అసలైన ప్లాన్. ఇది వినడానికి సరదాగా ఉన్నప్పటికీ సవాలుగా మారింది. మాకు కలిగిన అంతర్ దృష్టి నుంచి ప్రేరణ పొంది.. ఈరోజు దీన్ని మీ ముందు ఉంచగలిగాం. ఫలితంగా మేము ప్రపంచస్థాయి అవార్డు గెలుచుకున్న బయోమెటీరియల్ ఆవిష్కరణను సృష్టించాం. ఇది వందశాతం వాటర్ ఫ్రూఫ్ కలపతో తయారుచేయబడింది’ అని ఉడియో హోమ్స్ వివరించింది. అలాగే 10 నుంచి 15 సంవత్సరాలకు పైగా మన్నికగా ఉండే ఈ టాయిలెట్ రీసైకిల్ చేయడం చాలా కష్టమని భావించినప్పటికీ ఈ అంశంపై పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. దీని ధర కూడా రూ. 10 వేల లోపే ఉండటం విశేషం. కాగా ఇది యూరోపియన్ యూనియన్‌లోని మార్కెట్‌ల్లో అత్యధికంగా అమ్ముడు పోతున్నట్లు వెల్లడించింది. చివరగా ఇదే పద్ధతిలో కిచెన్ ప్లాట్ ఫామ్, బాత్ టబ్ వంటి ఇతరత్ర పరికరాలను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

Read More: ఫ్రిజ్‌లో పెట్టిన ఫుడ్ ను తింటున్నారా.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed